కోలీవుడ్ స్టార్ హీరో విశాల్, తమన్నా తో కలిసి సుందర్ దర్శకత్వం లో వస్తున్నా మొగుడు సినిమా పై చాల అంచనాలు ఉన్నాయ్… అసలు కాంబినేషన్ కూడా అదుర్స్ కదూ. ఐతే ఇందాకే ఈ సినిమా టైటిల్ టీజర్ లాంచ్ చేసి విశాల్ ఫాన్స్ ని ఖుష్ చేసారు నిర్మాతలు…
ఇక టీజర్ విషయానికి వస్తే, తమన్నా సీరియల్ చూస్తూ ఉంటుంది… దాంట్లో యోగి బాబు హీరో, అందులో భార్య చెప్పిన మాట వింటూ ఉంటాడు… అలా యోగి బాబు ని చూసి విశాల్ ని అలా ఉండమంటుంది తమన్నా. కానీ యోగి బాబు ఇంటికి వచ్చేసరికి, ఇల్లు తుడుస్తూ ఉంటాడు విశాల్… కానీ అలా యోగి బాబు టీ పెట్టమన్న తమన్నా విశాల్ ని కిచెన్ కి పంపించేసరికి అక్కడ గూండాలు రెడీ గా ఉంటారు. కానీ విశాల్ వాళ్ళని కిచెన్ లో ఉన్న సామాన్లతోనే ఉతికి ఆరేస్తాడు. అలా ఒక గూండా చెవిలో నోటిలో కారట్ పెట్టడం చుసిన యోగి బాబు అసలు విశాల్ ఏంటి ఇలా కొట్టేస్తున్నాడు అనుకుంటాడు…
కానీ భార్య కి మాత్రం చాల సింపుల్, ఏమి తెలియని మనిషి ల కనిపిస్తాడు… సో, మరి విశాల్ కోసం ఆ రౌడీలు ఎందుకు వచ్చారు, తమన్నా తో ఎందుకు నిజాలు చెప్పడం లేదు అన్న విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి…
మొత్తానికి టైటిల్ టీజర్ అదిరిపోయింది! సినిమా కోసం గట్టిగా వెయిటింగ్…