కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్’ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయ్. ముఖ్యంగా తెలుగు స్టేట్స్ఆంధ్రప్రదేశ్–తెలంగాణ ప్రాంతాల్లో ఈ సినిమాకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు అత్యంత భారీ మొత్తానికి సొంతం చేసుకోవడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. తెలుగు సినిమా కి కాకుండా ఈ రెండు రాష్ట్రాల్లో ఇంత పెద్ద డీల్ జరగడం అరుదైన విషయం కావడంతో ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమా మీద ఉన్న నమ్మకం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇప్పటికే ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ తో దేశవ్యాప్తంగా రికార్డులు సృష్టించిన యశ్, ఇప్పుడు ‘టాక్సిక్’ ద్వారా మళ్లీ పెద్ద తెరపై తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం 2026 మార్చి 19 గురువారం విడుదల కానుండగా, అదే సమయానికి ఉగాది, గుడిపాడ్వా, ఈద్ వంటి పండుగలు రావడం వల్ల బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ సినిమాను యశ్‌తో పాటు దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ కలిసి రచించగా, దర్శకత్వ బాధ్యతలను కూడా గీటు ఏ తీసుకుంది. ‘టాక్సిక్’ చిత్రాన్ని ఒకేసారి ఇంగ్లీష్ ఇంకా కన్నడ భాషల్లో చిత్రీకరించడంతో పాటు, తరువాత హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా పలు భాషల్లో డబ్ చేసి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కథా ప్రస్థానం, విజువల్ స్టైల్, యాక్షన్ ఎలిమెంట్స్ అన్ని కలిసి ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయికి మించిన గ్లోబల్ ప్రాజెక్ట్‌గా నిలబెట్టనున్నాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను వెంకట్ కె నారాయణ ఇంకా యశ్ కలిసి నిర్మిస్తుండగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ ఇంకా మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార విషయాలు, టైటిల్ కాన్సెప్ట్, యశ్ కొత్త లుక్ అన్ని కలిసి అభిమానుల్లో విపరీతమైన ఆసక్తిని పెంచాయి. “డాడీ ఈజ్ హోమ్” అనే ట్యాగ్‌లైన్ కూడా సినిమాపై హైప్‌ను మరింత పెంచుతోంది.