చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచిస్తూ మనసును ఒత్తిడిలోకి నెట్టుకుంటున్నారా? ఒక మెసేజ్ పంపేముందు ఎన్నోసార్లు టైప్ చేసి డిలీట్ చేస్తూ, “ఇలా పంపితే ఏమనుకుంటారు?” అనే ఆలోచనలతో సమయం వృథా అవుతుందా? ఇలాంటి ఓవర్ థింకింగ్ సమస్యకు ఇప్పుడు మానసిక నిపుణులు సూచిస్తున్న సింపుల్ కానీ ప్రభావవంతమైన పరిష్కారం 5-5-5 రూల్. ఇది మెంటల్ ఫిట్‌నెస్‌కు సంబంధించిన ఒక గ్రౌండింగ్ టెక్నిక్. మీకు టెన్షన్ కలిగిస్తున్న ఏ విషయమైనా సరే, ఆ క్షణంలో మీకే మీరు ఒక ప్రశ్న వేసుకోవాలి
“ఇది రాబోయే 5 నిమిషాల్లో నిజంగా నాకు అంత ముఖ్యమా? 5 రోజులకు దీని ప్రభావం ఉంటుందా? 5 ఏళ్ల తర్వాత కూడా ఇది నా జీవితాన్ని ప్రభావితం చేస్తుందా?” అని ప్రశ్నించుకోవడం చాలును. ఈ ఒక్క ప్రశ్న మన మెదడును భావోద్వేగాల నుంచి బయటకు తీసుకువచ్చి, లాజికల్‌గా ఆలోచించే దిశగా నడిపిస్తుంది. అప్పటివరకు పెద్ద సమస్యలా అనిపించిన విషయం నిజానికి తాత్కాలికమైనదని అర్థమవుతుంది. మానసిక నిపుణుల మాటల్లో చెప్పాలంటే, ఈ పద్ధతి యాంగ్జైటీకి ఫస్ట్ ఎయిడ్‌లా పనిచేస్తుంది. దీనిని రోజూ అలవాటుగా చేసుకుంటే, ఆలోచించే విధానం క్రమంగా మారి, మనసు మరింత స్థిరంగా, బలంగా మారుతుంది.