ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరిస్తున్న అమెరికా, అంతర్జాతీయ వేదికలపై ప్రతి దేశాన్ని ప్రశ్నించే సమయంలో ఒక మాటను తప్పనిసరిగా ప్రస్తావిస్తుంది. అదే ‘హ్యూమన్ రైట్స్’. ప్రజలకు స్వేచ్ఛ లేదని, భావ వ్యక్తీకరణకు అవకాశం లేదని, మహిళల హక్కులు కాలరాయబడుతున్నాయని పలుదేశాలపై అమెరికా తరచూ ఆరోపణలు చేస్తుంటుంది. కానీ తాజాగా చోటుచేసుకున్న ఒక ఘటన, అమెరికా చెప్పే హ్యూమన్ రైట్స్ నిర్వచనంపై పెద్ద ప్రశ్నార్థకాన్ని సృష్టిస్తోంది.
అర్ధరాత్రి సమయంలో వెనుజులా అధ్యక్షుడు, ఆయన భార్యను అదుపులోకి తీసుకుని అమెరికాకు తరలించారనే సమాచారం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అంతేకాదు, అక్కడ అధ్యక్షుడి భార్యను శారీరకంగా హింసించినట్టుగా వార్తలు వెలువడ్డాయి. ఆమె కంటికింద, కంటిపై గాయాలు కనిపించడం తీవ్ర అనుమానాలకు దారి తీస్తోంది. అమెరికన్ ఆర్మీ చేతిలో ఆమె దెబ్బలు తిన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నదని పలువురు పేర్కొంటున్నారు.
మహిళల హక్కులపై గొంతెత్తే అమెరికా, ఒక దేశ అధ్యక్షుడి భార్య విషయంలో ఇలా ప్రవర్తించడమేంటని అనేక దేశాలు ప్రశ్నిస్తున్నాయి. హ్యూమన్ రైట్స్ అంటే ఇతర దేశాలను విమర్శించడమేనా? తమ చర్యలకు మాత్రం అదే నిబంధనలు వర్తించవా? అంటూ మానవ హక్కుల సంఘాలు నిలదీస్తున్నాయి. ఈ ఘటనతో అమెరికా ద్వంద్వ వైఖరి మరోసారి బహిర్గతమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.