ఉత్తర కొరియాకు నెక్స్ట్ నాయకురాలిగా కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తె కిమ్ జు ఏను అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం తెలిసింది. దక్షిణ కొరియా గూఢచారి వర్గాల ప్రకారం, ఇప్పటికే ఆమెకు అవసరమైన శిక్షణ పూర్తయ్యిందని, అలాగే పాలనకు సంబంధించిన కీలక నిర్ణయాల్లో కూడా ఆమె భాగస్వామ్యం పెరుగుతోందని తెలుస్తోంది. త్వరలో జరగబోయే వర్కర్స్ పార్టీ సమావేశంలో ఈ అంశంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రపంచంలో అత్యంత కట్టుదిట్టమైన నియంతృత్వ పాలన కలిగిన దేశానికి తొలి మహిళా నాయకురాలిగా కిమ్ జు ఏ చరిత్ర సృష్టించే అవకాశముందని అంతర్జాతీయ వర్గాలు చర్చిస్తున్నాయి. అయినా కిమ్ కి మరి అంత పెద్ద వయసు కాదు కదా… ఎందుకు మరి ఇంత తొందరగా కూతుర్ని తీసుకురావడం అని అందరిలో ఒక question మెదులుతుంది!