ASIA CUP 2025 మొదలైంది… ఆల్రెడీ ఇండియా పాకిస్తాన్ ఇంకా UAE ని చిత్తుగా ఓడించింది… ఐతే నిన్న చిన్న దేశం OMAN ని కూడా అదే విధంగా చిత్తూ చేస్తుంది అనుకున్నారు అందరు. కానీ ఎందుకో ఈ మ్యాచ్ లో ఇండియా కొంచం కష్టంగా గెలిచింది…
అసలే ఈ టోర్నమెంట్ స్టార్ట్ అయిన్నప్పట్టినుంచి ఇండియా బాటింగ్ ఆప్షన్ సరిగ్గా రాలేదు. కానీ నిన్న సూర్య టాస్ గెలిచి, బాటింగ్ ఎంచుకున్నాడు… ఇంకేంటి అదిరిపోతోంది మన బాటింగ్ అనుకున్నాం… కానీ అనుకున్నది exact opposite అయ్యింది…
సరే నిన్నటి స్కోర్స్ అందరికి తెలిసిందే కానీ, ఎందుకు సూర్య బాటింగ్ చేయలేదు అన్నది, కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు అన్న లెవెల్ లో question మారుమోగిపోయింది.
అబూ ధాబీలోని షేక్ జాయిడ్ నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ గ్రూప్ స్టేజ్ చివరి మ్యాచ్‌లో, సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలుచుకొని బ్యాటింగ్ మొదలెట్టాలని నిర్ణయించగా, టీమ్ ఇప్పటికే ఎనిమిది వికెట్లు కోల్పోయినప్పటికీ, ఆయన ఆటకు రాలేకపోవడం అభిమానులను ఆశ్చర్యంలో ముంచింది.

మొదటి రెండు మ్యాచ్‌లలో నంబర్ 3 వద్ద బ్యాటింగ్ చేసిన సూర్యకుమార్, ఈసారి తన స్థానాన్ని సాంజూ సమ్‌సన్‌కు ఇచ్చారు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, Axar పటేల్ నాల్గవ, ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయగా, శివం దుబే, తిలక్ వర్మ నెక్స్ట్ బాటింగ్ చేసారు.

ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినది ఏమిటంటే, సూర్యకుమార్ ఎనిమిదో స్థానంలో కూడా రాకుండా, పేసర్ హర్షిత్ రాణాకు అవకాశమిచ్చారు. ఆ తర్వాత అర్షదీప్, కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్‌కు వచ్చారు.
ఇప్పటివరకు సూర్యకుమార్ కు ఏమైనా గాయ సమస్య లేదని, టాస్ సమయంలో ఆయన పూర్తిగా ఫిట్‌గా కనిపించారు. ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా, ఇతర ఆటగాళ్లకు అవకాశాన్ని ఇవ్వడం కావచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఈ మ్యాచ్‌కు ముందు, రెండు మ్యాచ్ లలో ఓపెనర్స్ అబీషేక్ శర్మ, షుబ్‌మన్ గిల్‌తో పాటు సూర్యకుమార్ మాత్రమే బ్యాటింగ్ చేసారు.

సూర్య బాటింగ్ చేయకపోయినా మ్యాచ్ గెలిచింది కానీ, మన టీం బాటింగ్ డెప్త్ కూడా తెలిసింది… నిన్న స్లో పిచ్ కాబట్టి, బాల్ ఎన్ని సార్లు బౌండరీ దెగ్గర పడి, కొంచం దూరంగానే ఆగిపోయింది. అలా అనుకున్నన్ని పరుగులు రాలేదు.

పరవాలేదు… నెక్స్ట్ మ్యాచ్ మల్లి పాకిస్తాన్ తో కాబట్టి, గెలవాలి, కచ్చితంగా గెలవాలి! అందుకే ఈ ఎక్స్పరిమెంట్ చేసారు. ఈసారి పాకిస్తాన్ మరింత గట్టిగ మొండిగా ఆడుతుంది. సో, ఇప్పుడు బాటింగ్ ప్రాక్టీస్ అవ్వకపోతే కష్టం అని కోచ్ గౌతమ్ గంభీర్ ఇంకా సూర్య ఈ డెసిషన్ తీసుకున్నారు…
మళ్ళి ఇండియా పాకిస్తాన్ ని ఇంకా చిత్తుగా ఓడించాలి అన్నదే మన కోరిక కదా… ఈసారి కూడా గెలిచి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా చేస్తే ఇక ఆ మజా నే వేరు కదా!