విజయనగరంలో పైడితల్లి అమ్మవారి జాతర కు సాంకేతిక పరిజ్ఙానంతో పాటు ఆర్మ్ డ ఫోర్స్ ను వాడుతోంది పోలీస్ శాఖ. ఎనిమిది నెలల క్రితం ఉగ్రవాది సిరాజ్ అరెస్ట్ ఆ పై కేసు పుణ్యమా విజయనగరం పోలీస్ సబ్ డివిజన్ పరిధి సిబ్బంది అలెర్ట్ అయ్యారు. సిరాజ్ కేసు విషయంలో ఇప్పటికే ఎన్.ఐ.ఏ రెండు సార్లు విజయనగరం టూటౌన్ కు వచ్చింది. వచ్చే నెల 5,6,7 తేదీలలో శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి పండగ జరగనుండటంతో పోలీస్ శాఖ అలెర్ట్ అయ్యింది. పైడితల్లి పండుగలో ప్రధాన ఘట్టమైన సిరిమాను జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు దృష్టి పెట్టారు. జాతరలో సిరిమాను,తెల్ల ఏనుగు,అంజలి రథ,బేస్తవారి వల,పాలధారలు ఎక్కడ నుంచీ మొదలవుతాయో వాటి వివరాలను,రూట్ మాప్ ను పోలీసులు సిద్దం చేస్తున్నారు.సిరిమాను జాతర మొత్తం విజయనగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే జరుగుతుందని ఈ సందర్భంగా ఎస్.హెచ్.ఓ ,సీఐ శ్రీనివాసరావు శనివారం తెలిపారు.
హుకుంపేటలో సిరిమాను,తెల్ల ఏనుగు,అంజలి రథం,కమ్మ వీదిలో బెస్తవారి వల,సాకేటి వీధిలో పాలధార లు తయారవుతున్నాయన్నారు.ఈ సారి జాతర మొత్త సాంకేతిక పరిజ్ఙానంతోనే బందోబస్తు చేపడుతున్నామన్నారు.తొలిసారిగా
250 కెమారాలతో సర్వ్ లెన్స్,బాడీ వార్న్ కేమారాలు,డాగ్ స్క్కాడ్ లతో ఎలాంటి అవాంచీనయ ఘటనలు జరుగకుండా నిఘా పెడుతున్నామన్నారు.తమ స్టేషన్ పరిది ఆబాద్ వీధికి చెందినఉగ్రవాది సిరాజ్ కేసుతో పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందని అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏకంగా ఈసారి ఆర్మడ్ ఫోర్స్ ను వాడుతున్నామన్నారు.ఇక రౌడీషీటర్స్ విషయంలోకూడా తమ పరిధిలో ఉన్న 130 మంది ఇప్పటికే నిఘా ఉంచామని,వారి కదికలు,ఫోన్ల ,చిప్ లను సేకరిస్తున్నామన్నారు.అలాగే స్టేషన్ పరిధిలో సమస్యాత్మక ప్రాంతాలైన వైఎస్ఆర్ నగర్,బాబామెట్ట,డబుల్ కాలనీ,కొండవెలగాడలలో చెక్ పోస్ట్ లతో పాటు అక్కడ కూడా సీసీ కెమారాలు,బాడీ వార్న్ లతో సిబ్బందిని పెడుతున్నామన్నారు.