సర్వవ్యాప్తమైన ఆ భగవంతుని ముందు మనుషులం మనం ఎంత. ఈ భూమిపై మహా అంటే ఒక మనిషి వందేళ్లు లేదా అంతకంటే తక్కువ సంవత్సరాలే బతుకుతాడు. ఈ చిన్న జీవితంలో… విశ్వం పుట్టుక నుంచి నేటి వరకు ఈ విశ్వం మొత్తం వ్యాపించి ఉన్న ఆ పరమాత్ముడి కంటే గొప్పవాడు కాలేడు కదా. ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాదు. భగవంతుని కంటే గొప్పవాడు కావడం అసంభవం. భగవంతుడిని ఆరాధించి ఆయన దయ మనపై ఉండేలా చూసుకోవాలి తప్పించి ఆయన కంటే గొప్పవాడు కావాలని, అందరూ తనను దైవం కంటే మిన్నగా చూడాలని అనుకుంటే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడికి జరిగిన విధంగా జరుగుతుంది.
మన సాధారణ మనుషుల వరకు చూసుకుంటే గొప్పవాడు అంటే ఎవరూ బాగా డబ్బున్నవాడే కదా అర్థం. డబ్బుంటే ఏదైనా సాధించవచ్చని అంటారు. ఆ డబ్బు చుట్టూనే మనుషులంతా సలాము చేస్తూ తిరుగుతుంటారు. మోసాలు, దారుణాలు, కబ్జాలు ఇవన్నీ డబ్బు కోసమే జరుగుతుంటాయి. భారత్లో అపర కుబేరుడు ఎవరంటే ముఖేష్ అంబానీ అంటాం. కావలసినంత ధనం ఉంది. హోదా, పలుకుబడి, అన్నీ ఉన్నాయి. తాను పిలిస్తే ఎవరైనా వస్తారు. అంబానీలతో భగవంతుడిని అవసరం లేదు. కానీ, అంబానీ వంటి వారికి భగవంతుని అవసరం ఉంది. మనసారా కొలిస్తేనే ఆయన పలుకుతాడు. అటువంటి బుద్ధిశాలైన విఘ్న వినాయకుడి ముందు అంబానీ మోకరిల్లి నమస్కరించాడు. స్వామివారిని మనసారా వేడుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నది.