వినాయక చవితి వస్తుందంటే చాలు వీధి వీధిలో వాడవాడలా గణపయ్యలు కొలువుదీరుతారు. మనం బజారుకు వెళ్లి అంగడిలో అమ్మే గణపయ్యలను తెచ్చుకొని ఇంట్లో పూజించుకుంటాం. కానీ, వీధుల్లో, పెద్ద పెద్ద వాడల్లో కొలువుదీరే గణపయ్యలు చాలా స్పెషల్‌గా, అందర్నీ ఆకట్టుకునే విధంగా తయారు చేయించుకుంటారు. ఒక్కో చోట ఒక్కో థీమ్‌తో తయారు చేయించుకుంటారు. క్రికెట్ మ్యాచ్ జరిగే సమయంలో దానికి సంబంధించిన థీమ్, లేదా దేశంలో ఏదైనా పెద్ద పెద్ద సంఘటనలు, అచీవ్‌మెంట్స్ జరిగిన సమయంలో వాటికి సంబంధించిన థీమ్‌తోనూ గణపయ్యలను తయారు చేయించుకుంటారు.
అయితే, ఈ ఏడాది ఓ సరికొత్త థీమ్‌తో గణపతిని తయారు చేయించుకున్నారు. అదే ఎస్ 400 గణపతి. ఇటీవల భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ గడ్డపై దాగున్న ఉగ్రవాదులపై విరుచుకుపడింది. ఆ సమయంలో వైమానిక దళానికి రక్షణగా, శతృవుల విమానాలను కూల్చివేసేందుకు సహకరించింది ఎస్ 400 వ్యవస్థ. ఇది రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్నాం. సమర్థవంతంగా పనిచేసినట్టుగా, శతృవులకు చెందిన ఎన్నో విమానాలను, డ్రోన్‌లను, క్షిపణులను ఈ ఎస్ 400 రక్షణశ్రేణి సమర్థవంతంగా ఎదుర్కొని వాటిని కూల్చివేసింది. ఈ విషయాన్ని భారత ఆర్మీ దృవీకరించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఎస్ 400 వ్యవస్థ గురించి చర్చనీయాంశంగా మారింది. ఈ థీమ్‌తోనే పలు ప్రాంతాల్లో గణపయ్యలను తయారు చేయించుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఓ చిన్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయింది. ఎస్ 400 గణపతిని ట్రాక్టర్‌లో తరలిస్తున్న దృశ్యాలను కొందరు వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. కావాలంటే మీరు కూడా ఓ లుక్కేయండి. నచ్చితే మా వెబ్‌సైట్ కింద ఉన్న కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.