కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రతి ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకునే ముందు పోలింగ్ బూత్‌లోని వివిధ ఏజెంటులు వారి గుర్తింపు కార్డు, వారి ముఖ కవలికలను తప్పనిసరిగా పరిశీలిస్తారు. సరిపోతున్నాయి అనుకుంటేనే ఓటింగ్‌కు అనుమతి ఇస్తారు. కానీ, ఇప్పటి వరకు బుర్ఖా ధరించిన మహిళలను ఈ విధంగా గుర్తించే సౌకర్యం రాలేదు. బూత్‌లో ఎక్కువగా మగవాళ్లే ఉండటంతో గుర్తింపు కష్టంగా మారింది. మహిళా అధికారిణులు పోలింగ్ బూత్‌లో ఉన్నప్పటికీ వారికి తగినంత సహకారం లభించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఈసీ కీలక నిర్ణయం తీసుకున్నది.
బెంగాల్‌లో బీజేపీ నేతలపై దాడులు… ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రధాని
ఇకపై ఎన్నికల సమయంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న మహిళలు కూడా ఎన్నికల అధికారిణిలుగా విధులు నిర్వహించనున్నారు. బుర్ఖా ధరించిన మహిళలను వారి ఓటర్ కార్డు ఆధారంగా ముఖ కవళికలను పరిశీలించనున్నారు. తద్వారా ఎన్నికలు మరింత పారదర్శకంగా, ఎలాంటి దొంగ ఓట్లకు తావు లేకుండా పోలింగ్ జరగునున్నది. రాబోయే స్థానిక, రాష్ట్రాల ఎన్నికల్లో అంగన్‌వాడీ కార్మికులను వినియోగించుకోనున్నారు. అయితే, అంగన్‌వాడీ కార్మీకులు స్థానికంగా మహిళలతో చోరవగా ఉంటారు. స్థానికుల నుంచి అంగన్‌వాడీ కార్మికులకు సహకారం లభిస్తుందని ఈసీ చెబుతున్నది. మరి ఈసీ నమ్మకాన్ని మారువేషంలో ఉన్న పోలీసులు సహకరిస్తారా చూడాలి.