పనివాళ్లను మనవాళ్లు అనుకుంటే…ఇలానే ఉంటుంది

Humanity Over Formality Sahasra’s Gesture Wins Hearts in Vizianagaram

సాయం చేసే చేతులుంటే…మాన‌వ‌త్వం ప‌రిమళిస్తే..! ఈ రెండు స‌ద్గుణాలు క‌లిస్తే….! స‌రిగ్గా ఉత్త‌రాంద్ర‌లోని విజ‌య‌న‌గ‌రం అందునా స‌రిస‌హ‌స్ర రౌజింగ్ ప్యాల‌స్ అందుకు కేంద్రం మైంది. కొన్నాళ్ల‌నుంచీ చిన్న శీను సోల్జ‌ర్స్ అధ్య‌క్షురాలు,ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు , భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త మజ్జి శ్రీనివాస రావు(చిన్న శ్రీను) కుమార్తె అయిన‌టువంటి, చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సహ‌స్ర‌ తమ వద్ద పని చేస్తున్న సిబ్బంది పట్ల మరోసారి తన ఆప్యాయతను చాటుకున్నారు.

ప‌ని చేస్తున్న మిగిలిన సిబ్బందికి ప్రేర‌ణ గా నిలిచారు.త‌న‌ వద్ద చాలా కాలంగా వంట మాస్టర్ గా పని చేస్తున్న అనిల్ ను ఎంత‌లా అదుకున్నారంటే చెప్ప‌ల‌న‌వి కాదు. గోదారోళ్ల‌కు సంక్రాంతి పండ‌గొచ్చిందంటే ఆకాశాన్ని తాకినంతగా సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌లో మునిగిపోతారు.ఉత్తరాంద్రోళ్ల‌కు క‌నుమ వ‌చ్చిందింటే భూలోకాన్నే చుట్టేసిన‌ట్టు అమితానందంలోకి వెళ్లిపోతారు. అలాంటి ఉత్త‌రాంద్రలో ఉంటూ వృత్తే ప‌నిదైవంగా చేసుకుని ఉంటున్న అభిన‌వ న‌లుడిని త‌న కుటుంబంలో స‌భ్యునిగా భావించి సంక్రాంతి పండుగ కానుక‌గా 55 ఇంచీలు ఎల్ఇడి టీవీ ను బహూకరించారు.

ఈ మేర‌కు న‌గ‌ర‌శివారు ప్ర‌దీప్ న‌గ‌ర్ లోని వసంత విహార్ లో గల అనిల్ రే ఇంటికి స్వ‌యంగా వెళ్ళి మ‌రీ వారి కుటుంబ సభ్యులకు సిరి స‌హ‌స్ర‌ తన చేతుల మీదుగా ఎల్ఈడీ టీవీని బహుమానం అందచేసారు. తాన ప‌ని చేస్తున్న సంస్థ‌లో కాని ,కంపెనీలో గాని మ‌రేదైనా యూనిట్ య‌జ‌మాని స్వ‌యంగా త‌న అభిరుచిని,ఇష్టాన్ని అవ‌స‌రాన్ని గుర్తించి మ‌రీ తీరిస్తే….అదే జ‌రిగింది వంట మాస్ట‌ర్ అనిల్ కు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు.గ‌తంలో ఫ్రిజ్ ఇవ్వ‌డం ఈ సారి ఏకంగా ఎల్.ఈ.డీ టీవీని ఇవ్వ‌డంతో అంత‌టితో ఆగ‌న చిన్న శ్రీను సోల్జ‌ర్స్ అదినేత్రి..కుక్‌మాస్ట‌ర్ పిల్ల‌ల‌ల‌ను కూడా అదేదో చిన్న‌,చిత‌క ,అలాగే దుంప‌ల బ‌డిలో చ‌ద‌వ‌టం లేదండోయి..కుక్ మాస్ట‌ర్ ఇద్ద‌రి పిల్ల‌ల‌ను కార్పొరేట స్కూల్ గా ఖ్యాతి కెక్కిన స‌న్ స్కూల్ లో చ‌దివిస్తుండటం విశేషం.ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోట వాసు, సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *