కర్ణాటకలో మళ్లీ మొదలైన రాజకీయ ముసలం

Political Turmoil Returns in Karnataka Congress as Minister Rajanna Faces Controversy
Spread the love

కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ ముసలం మొదలైంది. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ అధికారాన్ని చేపట్టిన తొలినాళ్లలో అధికారం కోసం అంతర్గత కుమ్ములాటలు జరిగిన సంగతి తెలిసిందే. అధిష్టానం జోక్యంతో ఈ కుమ్ములాటలకు చెక్‌ పడింది. కాగా, తాజాగా మరోసారి ఇంటి గొడవలు రచ్చకెక్కడంతో కాంగ్రెస్‌ పార్టీలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. రాహుల్‌ గాంధీ ఓట్ల చోరీ ఆరోపణలపై కర్ణాటక మంత్రి రాజన్న స్పందించిన తీరు సరిగా లేదనే కారణంగా ఆయన్ను పదవి నుంచి తప్పించింది. పార్టీ నుంచి తప్పించడంతో ఆయన వేరు కుంపటి పెట్టుకునేందుకు సిద్దమౌతున్నారని, కాంగ్రెస్‌ పార్టీని వదిలి బీజేపీలో చేరబోతున్నారని, బీజేపీ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో మాజీ మంత్రి రాజన్న కూడా ఉన్నారని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే హెసీ బాలకృష్ణ ఆరోపించారు. కాగా, ఈ ఆరోపణలను కాంగ్రెస్‌ పార్టీ నేత, రాజన్న కుమారుడు రాజేంద్ర రాజన్న తిప్పికొట్టారు. బీజేపీ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో హెసీ బాలకృష్ణ కూడా ఉన్నారని, ఆయనే కావాలని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, తన తండ్రికి పార్టీ మారే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు. చాలా కాలం తరువాత మరోసారి రాజకీయంగా కర్ణాటకలో దుమారం రేగడంతో ఈ దుమారం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.

పరివర్తిని ఏకాదశి రోజున ఈ పనులు చేయకూడదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *