కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేరళ అసెంబ్లీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చేఏడాది కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనుండగా… ఈసారి విజయం తమ వైపునే ఉందని కాంగ్రెస్ పార్టీ అధినేత తెలియజేశారు. వందశాతం తాము విజయం సాధించబోతున్నామని, పినరయి విజయన్ సర్కార్‌ను గద్దెదించుతామని అన్నారు. గత ఎన్నికల్లో సీపీఐ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ కూటమి 99 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా… కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కేవలం 41 స్థానాలకే పరిమితమైంది.
ఢిల్లీలో మరోసారి క్లౌడ్ సీడింగ్…
అయితే, వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రవ్యాప్తంగా బలం పుంజుకుంటామని, కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. విజయం తమ పక్షానే ఉంటుందని ఖర్గే బల్లగుద్దీమరీ చెబుతున్నాడు. అయితే, తమ పట్టును కోల్పోకుండా ఉండేందుకు సీపీఐ పక్కా ప్రణాళికలు వేస్తోంది. దేశం మొత్తంమీద సీపీఐ అధికారంలో ఉన్న రాష్ట్రం కేరళ కావడం..ఒక్కసారి పట్టుకోల్పోతే… తిరిగి అధికారంలోకి రావడం కష్టమౌతుంది కాబట్టి ఓడిపోకూడదనే సంకల్పంతో పనిచేస్తున్నది. మరోవైపు కమలనాథులు కూడా 2026 నాటికి కొన్ని స్థానాల్లో విజయం సాధించాలని, తమ ఉనికిని చాటుకుంటే రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చేందుకు ఉపయోగపడుతుందని అధిష్టానం ఆలోచిస్తోంది. ఇప్పుడు ఖర్గే వందశాతం గెలుస్తామని ధీమా వ్యక్తం చేయడంతో వచ్చే ఏడాది జరిగే కేరళ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.