విజయనగరం రూరల్ పోలీసులు బుధవారం అర్థరాత్రి నాకాబంధీ నిర్వహించారు. ఉగ్రవాది సిరాజ్ అరెస్ట్ తో నగరంలో అలాంటి జాడలు ఉన్నాయోమో నాకాబంధీ చేసి చూడాలని హోం శాఖ ఆదేశాలు జారీ చేయడంతో రోజుకో స్టేషన్ సిబ్బంది అర్థరాత్రిళ్లు తనిఖీ నిర్వహిస్తున్నారు. ఎస్పీ దామోదర్ సూచనలు, డీఎస్పీ గోవిందరావు ఆదేశాలు రూరల్ సీఐ లక్షణరావు హుకుంతో ఎస్ఐ అశోక్… తన సిబ్బంది రామకృష్ణ, సూర్యరావులతో విజయనగరం వై జంక్షన్, చెల్లూరు, రింగ్ రోడ్, ధర్మపురి లలో వాహన తనిఖీలు చేపట్టారు అలాగే ఫింగర్ ప్రింట్స్ డివైసస్ తో దాదాపు 30 మంది వివరాలు సేకరించారు.
ఈ తనిఖీల్లోనే నగరంలో ని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధి రాజీవ్ నగర్ కు చెందిన నేరస్థుడు రఘు అడ్డంగా దొరికిపోయాడు. అతగాడు ఓ ప్రొసిస్టూట్ కేసులో నిందితుడిగా కేసు నమోదై కోర్ట్ వరకు వెళ్లొచ్చాడు. రికార్డలలో నిందితునిగా పేరుండటంతో మరో సారి మద్యం కేసు, పాత నేరస్థుడి కేసులో విజయనగరం రూరల్ పోలీసులకు పట్టుబడటం విశేషం. విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి వై జంక్షన్ వద్ద ప్రమాదాల నివారణకై వాహనదారులకు సీఐ లక్షణరావు సూచనలిచ్చారు.