కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శాసన మండలి సభ్యులు శ్రీ కె.నాగబాబు గారు చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన స్థానికులు.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం, పైడి భీమవరం పంచాయతీ, ముక్కు పాలవలస గ్రామంలో “ఊక యార్డ్” నుండి వెలువడుతున్న పొగ కాలుష్యం కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు స్థానికులు వారి సమస్యను ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ డా.విశ్వక్సేన్ ద్వారా శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె.నాగబాబు గారి దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయమై తక్షణమే ఆ గ్రామానికి వెళ్లి స్థానిక ప్రజలతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ బోర్డ్ డైరెక్టర్ సందీప్ స్థానిక నాయకులు వడ్డాది శ్రీనివాసరావులను శ్రీ నాగబాబు గారు ఆదేశించారు. స్థానికులతో మాట్లాడిన అనంతరం అక్కడ తీవ్రమైన కాలుష్యం కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని నిర్ధారించారు.
అక్రమంగా వ్యాపారం చేస్తూ, ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్న ఆ ఊకయార్డును కేవలం 24 గంటల్లో అక్కడినుండి తరలించేశారు. చాలాకాలంగా తాము పడుతున్న ఇబ్బందులను గుర్తించి పరిష్కరించిన కూటమి ప్రభుత్వానికి స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతూ.. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శాసన మండలి సభ్యులు శ్రీ కె.నాగబాబు గారు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి వడ్డాది శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు గోవింద్ రెడ్డి, ఎఫ్ఎసిఎస్ చైర్మన్ బొంతు విజయ్ కృష్ణ, ఏఎంసి డైరెక్టర్ గొర్ల సూర్య, పిఎసిఎస్ డైరెక్టర్ దన్నాన రవీంద్ర, జనసేన పార్టీ యువ నాయకులు సువ్వాడ రామారావు, రాంప్రసాద్, అప్పన్న, లావేరు మండలం నాయకులు కాకర్ల బాబాజీ, పైడి భీమవరం ముక్కు పాలవలస జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.