పిల్లల శారీరక దృఢత్వం కోసం కామన్ ప్లే గ్రౌండ్ సిస్టమ్ అవసరం – నాగబాబు విజ్ఞప్తి

Nagababu Urges Common Playground System to Improve Children’s Physical Fitness and Mental Health

అందరిలోనూ ఎనర్జీ ఉంటుంది, పిల్లల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎనర్జీని సరైనమార్గంలో ఛానలైజ్ చేస్తే మంచి పౌరులుగా ఎదుగుతారు.

పిల్లలకు వారంలో కనీసం మూడు రోజులైనా ఫిజికల్ ఫిట్నెస్, గేమ్స్ , కో కరిక్యులర్ యాక్టివిటీస్ లో శిక్షణ ఇవ్వాలి.

నాలుగు గోడల మధ్య చదివీ చదివీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ పిల్లలు చాలామంది స్ట్రెస్ గురవుతున్నారు, మానసిక, శారీరక ఆరోగ్య ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు, స్ట్రెస్ తట్టుకోలేని కొందరు పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలున్నాయి. గేమ్స్ ఆడడం వలన కొంత స్ట్రెస్ తగ్గుతుంది.

ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్లేగ్రౌండ్స్ ఉంటాయి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో చాలావరకు ప్లేగ్రౌండ్స్ ఉండవు.

“Common Play Ground System” CPGS అనే విధానం ప్రవేశపెట్టి ZP పభ్లిక్ స్కూల్స్ , మునిసిపల్, కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్లే గ్రౌండ్స్ లో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ మినిమం ఫీస్ Pay చేసి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థులు ఆడుకోవడానికి, శారీరక సాధన చేయడానికి వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలి.

ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పే చేసే మినిమం ఫీస్ అమౌంట్ పబ్లిక్ స్కూల్స్ లో సానిటరీ స్టాఫ్ , ఇతర మెయింటెనెన్స్ కోసం వినియోగించవచ్చు. పబ్లిక్ స్కూల్స్ , ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థుల మధ్య సఖ్యత, అవగాహన కూడా ఏర్పడుతుంది.

గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ తరం పిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

శ్రీ నరేంద్ర మోదీ గారు, శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఏడు పదుల వయస్సులో కూడా ఎంతో యాక్టివ్ ‌గా ఉన్నారు. ప్రతిరోజూ ఉదయాన్నే యోగాచేస్తారు. ఆరోగ్యంగా, ఉత్సాహంగా పరిపాలన నిర్వహిస్తున్నారు.

ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ముఖ్య శాఖల బాధ్యతలు నిర్వహిస్తూ కూడా ఇప్పటికీ మార్షల్ ఆర్ట్స్ సాధనను కొనసాగిస్తున్నారు. ఇటీవల “టైగర్ ఆఫ్ మార్టియల్ ఆర్ట్స్” అనే అంతర్జాతీయ బిరుదును అందుకున్నారు.

“ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగిన యువత ఈ దేశానికి కావాలి..” అని స్వామి వివేకానంద చెప్పినట్టు అటువంటి యువతను తయారు చేస్తున్నామా.? కేవలం పుస్తక పురుగుల్లాగా వదిలేస్తున్నామా???

చదువుతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ , మార్షల్ ఆర్ట్స్ , సెల్ఫ్ డిఫెన్స్ , యోగా వంటి కార్యక్రమాలు కూడా అమలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని ఈ సభ ద్వారా కోరుతున్నాను, జై హింద్ – నాగ బాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *