ముంబై మహానగర ప్రాంతానికి నూతన ఊపిరి అందించబోతున్న నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్ట్ తొలి దశ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవీ ముంబై బయలుదేరారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభంతో ముంబై నగరానికి రెండో ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయం లభించనుంది. దీని ద్వారా వాణిజ్యం, పర్యటన, రవాణా రంగాలకు భారీ ఊతం లభించనుందని అధికారులు చెబుతున్నారు.
మృత్యుశకటాలుగా మారుతున్న బాణసంచా కేంద్రాలు
నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (NMIA) ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MMRDA) ఆధ్వర్యంలో నిర్మాణం కొనసాగుతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా అమలులోకి వస్తే, ముంబై చత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఉన్న భారాన్ని గణనీయంగా తగ్గించనుంది. ప్రపంచ స్థాయి సదుపాయాలతో ఈ విమానాశ్రయం నిర్మాణం జరుగుతోంది. ప్రారంభ దశలోనే పలు దేశీయ, అంతర్జాతీయ సేవలు ప్రారంభం కానున్నాయి.
ఇదే సమయంలో, ముంబై మెట్రో లైన్–3 తుదిదశ ప్రారంభం కూడా ఈ సందర్బంగా జరుగనుంది. ఈ లైన్ ప్రారంభంతో ముంబై ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు మరింత సులభతరం కానున్నాయి. ట్రాఫిక్ సమస్యలు తగ్గి, ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గుతుందని అధికారులు తెలిపారు.
ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ – “ముంబై మౌలిక వసతుల అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ (Ease of Living) సూత్రం కింద ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే మా లక్ష్యం” అని పేర్కొన్నారు.
నవీ ముంబై విమానాశ్రయం ప్రారంభం, మెట్రో లైన్–3 పూర్తి కావడం వంటి ప్రాజెక్టులు ముంబై నగరాన్ని భవిష్యత్ ఆధునిక మెట్రోపాలిటన్‌గా మార్చే దిశగా పెద్ద అడుగులు వేస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.