ఆంగ్ల సంవత్సరం దృష్ట్యా విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిదిలో ఆరు చోట్ల నాకాబంధీ నిర్వహిస్తున్నట్టు సీఐ లక్ష్మణ్ రావు మంగళవారం అన్నారు. సాయంత్రం ఆరుగంటల నుంచీ రాత్రి రెండు గంటల వరకు ఆరు ప్రాంతాలలో పోలీసులు పహారా కాస్తారన్నారు. కొత్త సంవత్సర వేడుకలలో మందు,మత్తు పదార్ధాలు విక్రయాలు,సరఫరాపై దృష్టి పెడుతున్నట్టు చెప్పారు. రాత్రి పన్నెండు గంటల తర్వాత రోడ్లపై మద్యం సేవించినా,పాదాచారులను ఇబ్బందులు పెట్టిన కేసులు తప్పవన్నారు.యువతీయువకులు పాశ్చాత్య సంస్ర్కతిని వీడి,శాంతి యుతంగా ఆహ్లాద వాతావరణంలో కుటుంబ పరంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలన్నదే మా పోలీస్ అభిమతమని సీఐ లక్ష్మణ్ రావు అన్నారు.
విజయనగరం శివారు జమ్ములో అసాంఘీక కార్యక్రమాల జరగకుండా రూరల్ పోలీసులు మంగళవారం అవగాహన చేపట్టారు.గ్రామస్తులతో రూరల్ సీఐ లక్ష్మణ్ రావు,ఎస్ఐ అశోక్ లు చైతన్యం కల్పించారు.గంజాయి,మట్కా,గుడుంబ వంటి మత్తు పదార్ధాలు రవాణ ఎక్కడ జరిగినా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అస్సలు వాటి జోలికి గ్రామస్తులెవ్వరూ పోకుండాగ్రామ పెద్దలే చూడాలన్నారు.ఆన్‌లైన్ మోసాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని,ముఖ్యంగా యువత తెలియని యూఆర్ఎల్ లు లింక్ లను ఓపెన్ చేసి ఇబ్బందులు పడొద్దన్నారు. కొత్త వేడుకలను ప్రశాంతంగా రోడ్లపై ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా జరుపుకోవాలని సీఐ లక్ష్మణ్ రావు సూచించారు.