పల్లె పండగ విజయం తాలూకు స్ఫూర్తిని కొనసాగించేలా పల్లె పండగ 2.0 ప్రణాళికలు ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ముఖచిత్రం సంపూర్ణంగా మారేలా ఈ ప్రణాళికలు ఉండాలని తెలిపారు.


మంగళవారం క్యాంపు కార్యాలయంలో పల్లె పండగ 2.0పై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్, కమిషనర్ శ్రీ కృష్ణతేజ, ఒ.ఎస్.డి. శ్రీ వెంకటకృష్ణ గారు, ఇంజనీరింగ్ చీఫ్ పంచాయతీరాజ్ శ్రీ బాలు నాయక్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.