గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ నూతన బ్రిడ్జిని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Deputy CM Pawan Kalyan Inspects Newly Constructed Bridge at Gollaprolu Housing Colony

•వంతెన నిర్మాణం పనుల నాణ్యత పరిశీలన
•ఉప ముఖ్యమంత్రి కు థ్యాంక్స్ చెబుతూ ప్లకార్డులు ప్రదర్శించిన కాలనీ వాసులు

పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ వద్ద నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సదర్శించారు. సుద్దగడ్డ కాలువపై నిర్మించిన వంతెన పనుల నాణ్యతను పరిశీలించారు. బ్రిడ్జి మొత్తం తిరిగి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. సుద్ధగడ్డ కాలువపై శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో రూ. 3.05 కోట్ల అంచనా వ్యయంతో రోడ్లు భవనాల శాఖ ఈ వంతెన నిర్మించింది. 2024 సెప్టెంబర్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో భాగంగా హౌసింగ్ కాలనీ సందర్శనకు వచ్చిన సందర్భంలో వరద ముంపులో ఉంది.

పడవపై వెళ్లి కాలనీవాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలువకు వరద వచ్చిన ప్రతిసారి ముంపునకు గురవుతోందని, రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామని హౌసింగ్ కాలనీ వాసులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు చెప్పారు. వరదలు వచ్చిన ప్రతిసారి జనజీవనం స్తంభించిపోతుందని వాపోయారు. ఆ సందర్భంలో కాలువపై బ్రిడ్జి నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆ మేరకు కార్యాచరణ రూపొందించి హామీ నెరవేర్చారు. శుక్రవారం సంక్రాంతి మహోత్సవ వేదికపై లాంఛనంగా బ్రిడ్జిని ప్రారంభించి శనివారం పరిశీలనకు వచ్చారు. ఈ సందర్భంగా ముంపు కష్టాలు తొలగించిన ఉప ముఖ్యమంత్రి కు కాలనీ వాసులు, స్కూలు పిల్లలు థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సర్ అంటూ ప్లకార్డులతో స్వాగతం పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *