Native Async

పవన్ కళ్యాణ్ ని పరామర్శించిన సీఎం చంద్రబాబు నాయుడు…

CM Chandrababu Naidu Visits Pawan Kalyan Amid Illness – OG Movie Racing Towards ₹500 Crore
Spread the love

మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరం తో బాధ పడుతున్న సంగతి తెలిసిందే… అయన OG ఈవెంట్ కారణంగా వాన లో తడిసారు. ఇక అప్పటి నుంచి జ్వరం దగ్గు పట్టుకున్నాయి… అందుకే మంగళగిరి నుంచి హైదరాబాద్ కూడా మెరుగైన ట్రీట్మెంట్ కోసం వచ్చారు. ఐతే, ఈరోజు పవన్ కళ్యాణ్ ని AP సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారు…

ఈ వార్త ని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ట్విట్టర్ పేజీ లో కంఫర్మ్ చేసి అయన ఆరోగ్య పరిస్థితి పై సమాచారం ఇచ్చారు… దీంతో ఫాన్స్ కూడా కొంచం కుదుటపడ్డారు…

“రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి @PawanKalyan ను గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి శ్రీ
@ncbn గారు పరామర్శించారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని ఉప ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లారు. కొద్ది రోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతూ ఆరోగ్యం గురించి వాకబు చేశారు.

ప్రస్తుతం జ్వరం తీవ్రత లేదని, దగ్గు ఎడతెరిపి లేకుండా వస్తోందని తెలిపారు. పరీక్షలు చేసి క్రానిక్ బ్రాంకైటిస్ మూలంగా దగ్గు ఎక్కువగా వస్తోందని, ఫలితంగానే గొంతు దగ్గర నొప్పి కూడా ఉందని వైద్యులు చెప్పినట్లు వివరించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రివర్యులు ఆకాంక్షించారు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మెగా డీఎస్సీని విజయవంతంగా నిర్వహించి ఒకేసారి 15,941 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వడాన్ని ప్రస్తావించారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నియామకపత్రాలు అందించే కార్యక్రమాన్ని నిర్వహించి యువతలో మనోధైర్యాన్ని, స్ఫూర్తిని నింపారని ముఖ్యమంత్రివర్యులకు కృతఙ్ఞతలు తెలిపారు.

అక్టోబర్ 4వ తేదీన ‘ఆటో డ్రైవర్ల సేవలో…’ కార్యక్రమంపై చర్చించారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని విజయవంతంగా అమలు చేయగలిగామని, తద్వారా మహిళలకు ఆర్థికపరమైన వెసులుబాటు కలుగుతోందని ముఖ్యమంత్రివర్యులు తెలిపారు. ఈ పథకం మూలంగా ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతో ఆటో డ్రైవర్లకు రూ.15 వేలు చొప్పున ఆర్థిక భరోసాను కల్పించే దిశగా తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని, 4 వ తేదీన విజయవాడలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆటో డ్రైవర్ల కోసం ఆలోచన చేసిన, చేపట్టిన ఈ పథకం కూడా కచ్చితంగా అందరి మన్ననలు పొందుతుందనే విశ్వాసాన్ని ఉప ముఖ్యమంత్రి వ్యక్తపరిచారు.

అక్టోబర్ 16వ తేదీన గౌరవ ప్రధానమంత్రి శ్రీ @నరేంద్రమోడీ గారు రాష్ట్ర పర్యటనను విజయవంతం చేయడంపై చర్చించుకున్నారు. జి.ఎస్.టి. సంస్కరణలపై అవగాహన కల్పించేందుకు చేపడుతున్న రోడ్ షో నిర్వహణ, అందుకు సంబంధించిన ప్రణాళికల ప్రస్తావన వచ్చింది.”

పవన్ కళ్యాణ్ OG సినిమా మొదటి రోజే 150 కోట్ల కలెక్షన్ దాటి ఇప్పుడు 500 కోట్ల దిశగా పయనం అవుతుంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *