ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నివాసంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశం – జల్ జీవన్ మిషన్, మ్యాజిక్ డ్రెయిన్స్, హనుమాన్ ప్రాజెక్ట్‌పై కీలక చర్చలు

Deputy CM Pawan Kalyan Meets CM Chandrababu Naidu at Undavalli Residence, Discusses Jal Jeevan Mission and Key Development Projects

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నివాసానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూఎస్, అటవీ శాఖకి సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నారు.

•జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల అభివృద్ధి నిధుల కేటాయింపు, నియోజకవర్గాల వారీగా జరిగిన కేటాయింపులు తదితర అంశాలపై చర్చ.

• ⁠రాష్ట్రవ్యాప్తంగా వివిధ పంచాయతీల్లో చేపట్టిన మ్యాజిక్ డ్రెయిన్ల పనుల గురించి తెలిపి అన్ని పంచాయతీల్లో ఈ తరహా డ్రెయిన్స్ నిర్మించడం ద్వారా పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా అమలు చేయవచ్చని వివరించారు.

Image

•నీటిపారుదలశాఖ పరిధిలోని డ్రైనేజ్ ల్లో పూడిక తీత అంశాన్ని ప్రస్తావించిన ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వేసవిలో పూడిక తీత పనులు చేపట్టి రైతులు పంటలు వేసేలోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

• ⁠అటవీ శాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్ట్ వివరాలను ముఖ్యమంత్రివర్యులకు తెలియజేశారు.

•అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోపై పలు అంశాలపై మాట్లాడుకోవాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ రోజు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి గారి నివాసంలో సమావేశం జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *