ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజయ,నగరం శ్రీశ్రీశ్రీపైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జరిగేందుకు డేగ కళ్లతో కట్టుదిట్టమైన భద్రత పోలీసశాఖ కల్పించిదని ఎస్పీ దామోదర్ సోమవారం అన్నారు.తొలేళ్లు,సిరిమాను ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన భద్రతాఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో ఏఎస్పీ సౌమ్యలత,డీఎస్పీ,షహబాజ్ అహ్మద్ లతో కలిసి నగరంలోని మూడు లాంతర్లు,కోట,హుకుంపేట,పోలీస కంట్రోల్ రూమ్ లను పరిశీలించారు.
ఈ సందర్బంగా మూడు లాంతర్లు వద్ద విలేకరులతో మాట్లాడుతూ సిరాజ్ లాంటి ఉగ్రవాదులు చెలరేగిపోకుండా ముందు జాగ్రత్తచర్యలుగా క్రైమ్ పార్టీ బృందాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టిందన్నారు. ఇందు కోసం ఆర్మడ్ రిజర్వుకు చెందిన స్పెషలైజ్డ్ పోలీసుసిబ్బందిని, డిస్ట్రిక్ట్ సెక్యూరిటీ స్పెషల్ వింగు సిబ్బందిని కూడా నగరంలోని పలుచోట్ల నియమించామన్నారు. పండగలో ఎటువంటివాంఛనీయ సంఘటనలు జరగకుండా 120 సిసి కెమెరాలను, 12 డ్రోన్స్ తో నిఘా పెట్టామన్నారు. రాత్రి సమయాల్లో కూడా 2కి.మీ.ల దూరం విస్తీర్ణం వరకు లైవ్ విజువల్స్ ను రికార్డు చేసే ప్రత్యేక డ్రోన్ ను కూడా బందోబస్తులోవినియోగిస్తున్నామన్నారు. ఆరు డాగ్స్, బాండ్ స్వ్కాడ్ బృందాలతో నగరంలోని ముఖ్య కూడళ్ళలో యాంటీ సేబటేజ్ తనిఖీలు కూడా చేపడుతున్నామన్నారు.
జేబు దొంగతనాలు, చైన్ స్నాచింగ్స్ జరగకుండా నేరస్థుల గురించి అవగాహన ఉన్న సిబ్బందితోప్రత్యేకంగా క్రైం టీమ్స్ ని ఏర్పాటు చేసామన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు సహాయపడేందుకు పట్టణంలోని కొన్ని ముఖ్య ప్రాంతాల్లో హెల్ప్ డెస్క్లను కూడా ఏర్పాటు చేసామని జిల్లా ఎస్పీ తెలిపారు.జిల్లా ఎస్పీ వెంట అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎ.ఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, డీఎస్పీలు గోవిందరావు,సీఐలు ఆర్వీకే.చౌదరి,శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.