Native Async

మోదీ కీలక నిర్ణయం… ఆసియన్‌ ఇండియా సమ్మిట్‌కు వర్చువల్‌గా హాజరు

PM Modi to Attend ASEAN-India Summit Virtually Jaishankar to Represent India in Kuala Lumpur
Spread the love

ఈనెల 26 నుంచి 28 వరకు మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరగనున్న ఆసియన్‌ ఇండియా సమ్మిట్‌కు ప్రధాని మోదీ వర్చువల్‌గా హాజరుకాబోతున్నారు. ఆయ వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా తన ప్రసంగాన్ని వినిపించనున్నారు. ఈ ఏడాది దీపావళి వేడుకలతో పాటు బీహార్‌ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తన ప్రజెన్స్‌ అవసరం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, మోదీ స్థానంలో విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ప్రత్యక్షంగా హాజరువుతున్నారు.

కౌలాలంపూర్‌లో జరుగనున్న ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా హాజరుకానున్నారు. ప్రధాని మోదీతో దైపాక్షిక సమావేశం ఉండే అవకాశం ఉంటుందని ఇప్పటి వరకు వార్తలు రాగా, మోదీ వర్చువల్‌గా హాజరవుతున్న నేపథ్యంలో ఈ చర్చలు ఉండకపోవచ్చని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆసియన్‌ సదస్సును భారత్‌ అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలపై చర్చించాలని అనుకున్నారు. కానీ, వర్చువల్‌గా మాత్రమే మోదీ హాజరవుతుండటంతో వాణిజ్య చర్చలు పోస్ట్‌పోన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. టారిఫ్‌ 50 శాతం నుంచి 15 లేదా 16 శాతానికి తగ్గించే అంశాన్ని చర్చించాలని కూడా అనుకున్నారు.

ఇక ఇదిలా ఉంటే అమెరికా దూరమైనా… భారత్‌ ఆసియా దేశాలతో మంచి సంబంధాలను కలిగి ఉన్నది. ఆయిల్‌ విషయంలో రష్యాతో మైత్రిని నడుపుతున్నది. తక్కువ ధరకు ఆయిల్‌ను కొనుగోలు చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే అమెరికా భారత్‌పై టారిఫ్‌లు విధించింది. కానీ, భారత్‌ టారిఫ్‌లకు తలొగ్గకుండా ఆత్మనిర్భర్‌ భారత్‌ పేరుతో సొంతంగా తయారు చేసిన వాటిని సొంతం కోసమే వినియోగిస్తున్నది. బలమైన శక్తిగా ఎదుగుతున్న భారత్‌కు అమెరికా అవసరం కొంతవరకే ఉన్నా… మిగతా దేశాలతో ఎక్కువగా ఉంటుంది. భారత్‌ మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *