Native Async

పాప్‌ సింగర్‌ టేలర్‌ స్విఫ్ట్‌ మరో సంచలనం… టాప్‌లిస్ట్‌లో షోగర్ల్‌

Pop Singer Taylor Swift Creates New Sensation — Tops Global Showgirl Chart
Spread the love

బిల్‌బోర్డ్‌ హాట్‌ 100లో స్థానం దక్కించుకున్న పాప్‌ సింగ్‌ టేలర్‌ స్విప్ట్‌.  ది లైఫ్‌ ఆఫ్‌ ఎ షోగర్ల్‌ అనే ఆల్బమ్‌లోని 12 పాటలు టాప్‌ చార్ట్‌లో నిలిచాయి.  12 పాటలు టాప్‌గా నిలవడం చరిత్రలో ఇదే మొదటిసారి.  ఈ ఘనత సాధించిన మొట్టమొదటి పాప్‌ సింగర్‌ టేలర్‌ స్విఫ్ట్‌.  తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే పాప్‌ సింగర్‌గా ఎదిగినట్టు తెలిపారు.  బాల్యంలో తాను స్టాక్‌ బ్రోకర్‌ కావాలని అనుకున్నానని, కానీ, కొంత వయసు వచ్చాక తనకు మ్యూజిక్‌పై ఇష్టపం ఏర్పడటంతో ఆ దిశగా అడుగులు వేశానని తెలిపింది. 

ఇలా తింటే…మీరు అస్సలు బరువు పెరగరు

తనకోసం తల్లిదండ్రులు పెన్సిల్వేనియా నుంచి టెన్నెస్సీకి మకాం మార్చారని, 12 ఏళ్ల వయసులో గిటార్‌ నేర్చుకొని సొంతంగా పాటలు రాస్తూ వాటిని పాడటం మొదలుపెట్టినట్టు టేలర్‌ తెలియజేసింది.  2006లో తొలి ఆల్బమ్‌ ఫియర్‌లెస్‌కు ఆ ఏడాది గ్రామి అవార్డు లభించింది.  ఇప్పటి వరకు 16 ఆల్బమ్స్‌ రూపొందించిన టేలర్‌ స్విఫ్ట్‌ మరిన్ని ఆల్బమ్స్‌ రూపొందించే దిశగా అడుగులు వేస్తోంది. 

అందరూ చెప్పినట్టుగానే స్టాక్‌బ్రోకర్‌ని కావాలని ఆశపడి…సింగర్‌గా మారిపోయినట్టుగా టేలర్‌ స్విఫ్ట్‌ తెలియజేంది.  ఎవరి టాలెంట్ ఎలా ఉంటుందో చెప్పలేం కదా.  పాప్‌ మ్యూజిక్‌ మహరాణిలా వెలుగొందుతున్న టేలర్‌ స్విఫ్ట్‌ మరిన్ని అద్భుతమైన పాప్‌ మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ను అందించాలని మనసారా కోరుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *