Native Async

శబరిమల అయ్యప్పను దర్శించుకున్న రాష్ట్రపతి ముర్ము

President Droupadi Murmu Visits Sabarimala Ayyappa Temple in Kerala — Historic Darshan Highlights Faith Beyond Politics
Spread the love

దేశ ప్రధమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు కేరళలోని శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. నల్లదుస్తులు ధరించిన ద్రౌపది ముర్ము ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి కేరళ వెళ్లి అక్కడి నుంచి ఆర్మీ హెలికాఫ్టర్‌ ద్వారా కొంతదూరం ప్రయాణించి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. కాగా, నిన్నటి రోజున ఢిల్లీ నుంచి కేరళ వెళ్లిన ద్రౌపది ముర్మును కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్వాగతం పలికారు. ఈరోజు ఉదయం రాష్ట్రపతి దీక్షా వస్త్రాలు ధరించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, ఒక వయసు దాటిని మహిళలు స్వామివారిని దర్శించుకోవచ్చు అనే విధానం ద్వారానే తాను శబరిమల అయ్యప్పను దర్శించుకున్నట్టుగా తెలిపారు. రాష్ట్రపతి ముర్ము శబరిమల ఆలయాన్ని సందర్శించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. రాజకీయాలు వేరు, భక్తి వేరని… దైవం ముందు అందరూ సమానమేనని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

గుజరాత్‌లోని డాకోర్‌లో ప్రసాదం లూటీ ఉత్సవం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *