ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 9, 2025న ముంబైలో 33.5 కిలోమీటర్ల పొడవైన ఆక్వా లైన్ మెట్రోను ప్రారంభించారు. ఆరే జేవీఎల్‌ఆర్ నుంచి కఫ్ పరేడ్ వరకు 27 స్టేషన్లను కలుపుతూ ఈ మెట్రో లైన్ నగర రవాణా వ్యవస్థలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ప్రారంభ దినానే ఈ లైన్‌పై 1,56,456 మంది ప్రయాణికులు ప్రయాణించడం గమనార్హం.
ఈ మెట్రో లైన్ ద్వారా ముంబై నగరంలోని ప్రధాన వాణిజ్య కేంద్రాలు, నివాస ప్రాంతాలు, ఐటీ కారిడార్‌ల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. దీంతో రోడ్లపై వాహన రద్దీ తగ్గి, వాయు కాలుష్యం కూడా నియంత్రణలోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం, ఈ లైన్ పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభమైన తర్వాత రోజుకు లక్షలాది వాహనాలు రోడ్లపైకి రాకుండా తగ్గుతాయని, ఇది నగర పర్యావరణానికి కూడా లాభదాయకమని పేర్కొంటున్నారు.
ఢిల్లీ సుల్తాను కూతురు బీబీనాంచారిగా ఎలా మారింది?
అయితే, ఈ ప్రాజెక్టు ప్రారంభం మరోసారి 2019లో ఆరే కాలనీ చెట్ల నరికివేత వివాదాన్ని తెరపైకి తెచ్చింది. ఆ సమయంలో మెట్రో కార్‌షెడ్ నిర్మాణానికి వ్యతిరేకంగా పర్యావరణ కార్యకర్తలు, సినీ ప్రముఖులు, విద్యార్థులు భారీ స్థాయిలో ఆందోళనలు చేపట్టారు. వారి నిరసనల కారణంగా ప్రాజెక్టు కొన్ని సంవత్సరాలపాటు నిలిచిపోయి, దాదాపు ₹10,000 కోట్ల అదనపు వ్యయం ప్రభుత్వం భరించాల్సి వచ్చింది.
ఇప్పుడు ఆక్వా లైన్ ప్రారంభమైన తర్వాత, అదే నిరసనకారులు మెట్రో సదుపాయాన్ని ఉపయోగిస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో వ్యంగ్యంగా వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. “ఆరే కోసం ఆందోళన చేసినవారు, ఇప్పుడు ఆరే నుంచి కఫ్ పరేడ్‌కి మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు” అంటూ నెటిజన్లు చురకలు వేస్తున్నారు.