తెలంగాణ మున్సిపల్ విజయంపై ప్రియాంక గాంధీ అభినందనలు… రేవంత్ రెడ్డితో ఢిల్లీలో భేటీ

Priyanka Gandhi Congratulates CM Revanth Reddy on Congress Victory in Telangana Municipal Elections

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా లోక్‌సభ సభ్యురాలు మరియు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీమతి ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఢిల్లీలో ఆమెను ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా కలుసుకుని మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై విశేషంగా చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌కు లభించిన భారీ ప్రజా మద్దతుపై ప్రియాంక గాంధీ ఆనందం వ్యక్తం చేస్తూ, ఈ విజయానికి ముఖ్యమంత్రి నాయకత్వమే కారణమని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు సంతృప్తి చెందడంతోనే ఈ అద్భుతమైన విజయాన్ని అందించారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *