కోడి పందాలు ఆడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ జిల్లా ప్రజలకు పెద్ద పండుగ సందర్బంగా అది పేద్ద హెచ్చరికను సోమవారం ఇచ్చారు.ప్రజలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలైన కోడి పందాలు, పొట్టేలు పందాలు, పేకాట వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు.గతంలో పేకాట, కోడి పందాలతో ప్రమేయం ఉన్న 80మందిని గుర్తించి, మంచి ప్రవర్తన కోసం బైండోవరు చేసామని జిల్లా ఎస్పీ దామోదర్ పేర్కొన్నారు.సంప్రదాయ పద్దతిలో సంక్రాంతి జరుపుకోవాలని
క్షేత్ర స్థాయిలో కోడి పందాలు, పొట్టేలు పందాలు, పేకాటలు నిర్వహించే ప్రాంతాలను డ్రోన్ లతో పర్యవేక్షిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు.
సంక్రాంతి పండగ పేరుతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే, చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. కోడి పందాలు, పొట్టేలు పందాలు, పేకాటలు, గుండాటలు మరియు ఇతర రకాలైన జూద క్రీడలను నిర్వహిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని, అటువంటి ఆటలు ఆడేవారిపైహిస్టరీ షీట్ లను తెరుస్తామని తెలిపారు. ఇప్పటికే గతంలో పేకాట, కోడి పందాలతో ప్రమేయం ఉన్న 80 వ్యక్తులను గుర్తించి, వారిని మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వారి వద్ద మంచి ప్రవర్తనకు బైండోవరు చేసామన్నారు.
కోడి పందాల నియంత్రణకు హైకోర్టు ఆదేశాలతో మండల స్థాయిలో రెవెన్యూ, స్థానిక పోలీసులు మరియు జంతు సంరక్షణ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేసామన్నారు. క్షేత్ర స్థాయిలో గ్రామస్థులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలను చేపట్టవద్దని, వాటిలో భాగస్వాములు కావద్దని, పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు.
పండగకు పోలీస్ బాస్ ఇచ్చే సూచనలు,జాగ్రత్తలు ఇవే
సంక్రాంతి పండుగను సుఖసంతోషాలతో కుటుంబాలతో సంప్రదాయం బద్దంగా జరుపుకోవాలని విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ సోమవారం ప్రజలను కోరారు. అందుకు ఈ కింద జాగ్రత్తలు,సూచనలను ప్రతీ ఒక్కరూ పాటించాలన్నారు.
-పండగలకు స్వంత గ్రామాలకు వెళ్ళే ప్రజలు సురక్షితమైన ప్రయాణం చేయాలి
- ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలి.
- మద్యం సేవించి వాహనం నడపరాదు.
- పట్టుబడితే జైలుకు పంపడం ఖాయం.
-, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి. - ఆటోలలో, బస్సులలో ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త.
- బాగ్ కటింగ్ వంటివి జరిగే ప్రమాదం పొంచి ఉంటాయి.
- ప్రజలు,ప్రయాణీకుఉ అప్ప్రమత్తంగా ఉండాలి.
-ఎల్.హెచ్.ఎం.ఎస్. మొబైల్ యాప్ను డౌన్లోడు చేసుకోవాలి. - నిఘా పెట్టే విధంగా స్థానిక పోలీసులకు సమాచారాన్ని అందించాలి.
- ఊరెళ్లినప్పుడు ఇండ్లలో విలువైన వస్తువులను ఉంచవద్దు.
- తమతో తీసుకొని వెళ్ళడం లేదా బ్యాంకు లాకర్లలో భద్రపర్చు కోవాలి.
-గాలి పటాలు ఎగుర వేసేందుకు చైనీస్ మంజాలు వినియోగించొద్దు.