భారత దేశంలో భిన్నమతాలు, భిన్న సంస్కృతులు, భిన్నమైన భాషలు. భిన్నత్వంలో ఏకత్వంగా నిలుస్తోంది భారత్. అయితే, ఈ భిన్నత్వంలో కొన్ని లుకలుకల కారణంగా సంస్కృతులు దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశంలోని పౌరులందరికీ ఒకేవిధమైన పాలన అందాలని, ఒకేవిధమైన సదుపాయాలు కొనసాగాలని, ఒకేవిధమైన సంస్కృతిని అలవాటుగా మార్చాలని, ఒకవిధమైన జీఎస్టీని కూడా అమలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాలను ఒక్కతాటిపైకి, ఒక్కమాటపైకి తీసుకురావాలని, ఇలా తీసుకొచ్చే సత్తా ఒక్క సంస్కృతం భాషకు మాత్రమే ఉంటుందని అన్నారు.
Live: కాస్తభంజన్ హనుమాన్ దర్శనం
ప్రపంచంలోని భాషలన్నింటికీ మూలం సంస్కృతం. కాగా, కాలాంతర్గతంగా సంస్కృతం భాష చాలా వరకు కనుమరుగైంది. దేవభాషగా ప్రసిద్ధి పొందిన ఈ భాషను మరలా చైతన్యవంతం చేయాలని, ప్రతి ఒక్కరూ సంస్కృతం మాట్లాడే విధంగా చేయాలని చెబుతున్నారు. ప్రపంచంలో సంస్కృతి ప్రారంభమయ్యే సమయంలో ప్రపంచ దేశాల్లో అత్యధికంగా సంస్కతం భాషనే మాట్లాడేవారని, ఇప్పుడు ఈ భాషను మరోసారి యాక్టీవ్‌గా తీసుకొస్తే దేశాల్లో కదలిక వస్తుందని, దైవభాష ప్రాతినిథ్యం ఇవ్వాలని యూపీ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మరి దీనిపై కమ్యునిస్టులు, కాంగ్రేస్ నేతలు, ప్రతిపక్ష నేతలు, భాషావాదులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.