ముందు జోష్… తర్వాత మెసేజ్.విజయనగరం టూటౌన్ సీఐ వినూత్న యత్నం…!”నేటి ప్రపంచం. కామ్” అందిస్తోంది మీకోసం…..దేశానికి వెన్నుముక అన్నదాత… అదే దేశాన్ని ముందుకు తీసుకెళ్లేది రెక్కలున్న యువత. అలాంటి యువత చెడుదారులలో పయనిస్తే ఆ దేశమే అధోగతి. ఈ మెసేజ్ ని యాండ్రాయ్డ్ యుగంలో మునిగి తేలుతున్న యూత్ కు తన దైన శైలిలో సందేశాత్మకమైన విషయాన్ని చెప్పారు విజయనగరం టౌన్ సీఐ టీ. శ్రీనివాస్. రెండు రోజుల క్రితమే వినాయక నిమజ్జనాలు వైభవోపేతంగా ముగిసాయి.
ఆ సందర్భంలోనే యువతను ఆకర్షించి, వారికి ఓ స్పూర్తి దాయకమైన సమాజానికి ఉపయోగపడే సమాచారాన్ని వారి అడుగు జాడలలోనే వెళ్లి వారిచేతేనే ఇప్పించారు. ఇందుకు విజయనగరం వైఎస్సార్ నగర్ వేదికైంది. స్టేజ్ షోలలో ఫేమస్ అయిన పల్సర్ బైక్ ప్రొగ్రామ్ పెట్టిన అనంతరం భారీ గా హాజరైన యువతకు ఓ చిన్న సందేశం ఇచ్చారు. పాము చావకూడదు, ఆపై కర్ర విరగకూడదన్న చందంగా సీఐ శ్రీనివాస్ డ్రగ్స్ అలవాటు చేసుకుంటే అంటూ చురకలంటిస్తూ ఓ అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు… “నేటి ప్రపంచం. కామ్” అందిస్తున్న దృశ్యాన్ని మీరూ చూద్దురూ.,!