విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో మిన్నంటిన నూతన సంవత్సర సంబరాలు… వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు…
కొత్త ఉత్సాహం, ఆశయాల మధ్య విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయం నూతన సంవత్సర వేడుకలకు వేదికైంది. ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ , వై ఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారు , అల్లుడు నెల్లిమర్ల నియోజకవర్గం వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు ప్రదీప్ నాయుడు, కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా ప్రారంభించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మిఠాయిలు పంపిణీ చేశారు.
జిల్లా నలుమూలల నుండి వేల సంఖ్యలో ప్రజాప్రతినిధులు, అభిమానులు తరలివచ్చి చిన్న శ్రీను, అల్లుడు ప్రదీప్ నాయుడు, సిరమ్మ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంబరాల్లో మాజీ డిప్యూటీ సీఎం సాలూరు మాజీ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, విజయనగరం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రావణి, కౌశిక్, నగర కార్పొరేటర్లు, వివిధ మండలాల నుండి వచ్చిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, గ్రామ సర్పంచ్ లు, ఎంపీటీసీలు మరియు వైఎస్సార్ సీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. కార్యాలయ ఆవరణ అంతా పండుగ వాతావరణం నెలకొంది. కాగా జేడ్పీ చైర్మన్చి న్న శ్రీను ప్రదీప్ నాయుడు, సిరి సహస్ర లు స్వయంగా ప్రతీ ఒక్కరికీ అభివాదం చేస్తూ నూతన సంవత్సర ఆకాంక్షలు తెలియజేశారు.