విజయనగరం పూల్‌బాగ్ రోడ్డులో జగన్నాథ్ ఫంక్షన్ హాల్ బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి విస్తృత సమావేశంతో కోలాహలంగా మారింది. ఈ సమావేశంలో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) వారసులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఘన నివాళులు ఆత్మీయ పలకరింపులు
సమావేశానికి విచ్చేసిన నెల్లిమర్ల నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ యువజన విభాగం అధ్యక్షులు ప్రదీప్ నాయుడు, ‘చిన్న శ్రీను సోల్జర్స్’ అధ్యక్షురాలు సిరమ్మ దంపతులు తొలుత దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సమావేశానికి హాజరైన పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలను ఆప్యాయంగా పేరుపేరునా పలకరిస్తూ ఉత్సాహపరిచారు.
పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం
తమ అభిమాన నాయకుడు చిన్న శ్రీను అల్లుడు, కుమార్తె సిరి సహస్ర లు పార్టీ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు.యువతను సమన్వయం చేస్తూ, పార్టీ బలోపేతానికి వీరు చూపిస్తున్న చొరవ సమావేశంలో చర్చనీయాంశమైంది. ఈ దంపతుల రాకతో సమావేశ ప్రాంగణంలో కొత్త ఉత్సాహం కనిపించింది. వచ్చే ఎన్నికల దిశగా పార్టీ క్యాడర్‌ను సమాయత్తం చేసే ఈ కీలక భేటీలో ప్రదీప్ నాయుడు, సిరమ్మల భాగస్వామ్యం వైఎస్ఆర్ సీపీ భవిష్యత్ కార్యాచరణలో యువత పాత్రను చాటిచెప్పేలా వ్యూహ రచన వ్యక్తమవుతోంది.