బీహార్ ఎన్నికల ఫలితాలే దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపుతున్నాయి. ఓటమిని ప్రతిపక్షాలు అంచనా వేసినా… ఫలితాలు ఇంత దారుణంగా ఉంటాయని ప్రతిపక్షాలు ఊహించలేకపోయాయి. అటు ఎగ్జిట్ పోల్స్ కూడా 141 లేదా 150 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసినా… దానికి మించేలా ఫలితాలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఎన్డీయే కూటమి 190 స్థానాల్లో లీడింగ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది ఆ కూటమికి మరింత బలాన్ని ఇచ్చే అంశమే. ప్రభుత్వ పథకాలు, కేంద్రం అందించిన సహకారం, పాలనలో వైవిధ్యం, బీహార్ అభివృద్ధి. ఇవే కూటమి విజయానికి సంకేతంగా మారాయి. కూటమిలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చివరకు సీట్లు సర్థుబాటు చేసుకొని సుస్థిరమైన ప్రభుత్వమే కావాలని బీహారీలు కోరుకున్నారు. సుస్థిరమైన పాలన అందిస్తే ప్రజలు వారికే మద్దతు ఇస్తారని బీహార్ ఫలితాలు చెబుతున్నాయి. పార్టీలు, పాలకుల కంటే పాలనే ముఖ్యమని బీహారీలు గమనించారు. పార్టీ, నాయకుల కంటే పాలనకే బీజేపీ మొగ్గుచూపుతుంది. అటు నితీష్ కుమార్ కూడా అదే ఆలోచనతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
బీహార్ ఫలితాలుః దూసుకుపోతున్న ఎన్డీయే
బీహార్ మహిళల ఖాతాల్లో సొమ్మును జమచేయడం, ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం కట్టుబడి ఉండటంతో బీహార్ ప్రజలు ఎన్డీయేవైపు మొగ్గుచూపారు. దేశవ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరిస్తున్న నేపథ్యంలో బీహార్‌లో కూడా ఆ పార్టీకి తిరస్కరణ ఎదురైంది. గతంలో కంటే తక్కువ స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ ఆధిక్యం కూడా అంతే తక్కువగా ఉంది. అంతేకాదు, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ఎంజీబీ పరిస్థితి కూడా అలానే ఉంది. ఎక్కువ స్థానాల్లో పోటీ చేసినా ఆధికత్యం గతం కంటే చాలా తక్కువగా ఉండటం విశేషం. కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి అధికారంలోకి వస్తే మరోసారి బీహార్ వెనబడిన రాష్ట్రంగా మారుతుందని ప్రజలు గ్రహించి ఉంటారు. బహుశా అందుకే మరోమారు కూడా అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్న ఎన్డీయే వైపే ప్రజలు మొగ్గుచూపారు. ఈసారి కూడా నితీష్‌కుమార్ అనుకున్న విధంగా పాలన చేస్తే తప్పకుండా బీహార్‌లో ఎన్డీయే కూటమి శాశ్వతంగా పాలన సాగించే అవకాశం లభిస్తుందనడంలో సందేహం లేదు.