రహస్యాలకు నెలవైన ఈ నరసింహస్వామి ఆలయం వరంగల్ జిల్లా మండపేట తాలూకాలోని మల్లూరు అనే గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి స్వామిని శ్రీహేమాచల లక్ష్మీనరసింహ స్వామిగా పిలుస్తారు. చుట్టూ ఎటు చూసినా పచ్చని ప్రకృతి… ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కల మధ్య ఈ క్షేత్రం ఉంది. ఈ క్షేత్రంలోని ఆలయాన్ని సుమారు 4797 సంవత్సరాల క్రితం శాతవాహన శకం నాటి దిలీపకర్ణి అనే మహారాజు నిర్మించినట్టుగా చరిత్రకారులు చెబుతున్నారు. ఇక్కడి ఆలయంలోని స్వామివారి విగ్రహం గురించే మనం ప్రధానంగా చర్చించుకోవాలి.
స్వామివారి విగ్రహం మానవ శరీరం మాదిరిగానే మెత్తగా ఉంటుంది. స్వామివారి చాతిపై రోమాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఇక ఈ విగ్రహం సుమారు 9 అడుగుల 2 అంగుళాల ఎత్తు ఉంటుంది. స్వామివారి విగ్రహాన్ని ఎక్కడ ముట్టుకున్నా మానవ శరీరం మాదిరిగా మెత్తగా ఉంటుంది. శ్రీశైలంలోని ఇష్టకామేశ్వరి అమ్మవారి విగ్రహం నుదురు మెత్తగా ఉంటే, మల్లూరు హేమాచల నరసింహస్వామి విగ్రహం మొత్తం మెత్తగా మానవ శరీరం మాదిరిగా కనిపిస్తుంది. ఇలాంటి వింతైన విగ్రహం ప్రపంచంలో మరెక్కడా మనకు కనిపించదు.
విగ్రహం ఇలా ఎందుకు ఉంటుంది అన్నది మిస్టరి. ఇక్కడికి ఎలా వచ్చింది అన్నది కూడా నిఘూడ రహస్యమే. అంతేకాదు, ఈ ఆలయంలోని విగ్రహంలో మరో విశేషం కూడా ఉంది. స్వామివారి ఉదరం నుంచి ద్రవం స్రవిస్తూ ఉంటుంది. ఇలా ఉదరం నుంచి ద్రవం కారడం వెనుక ఓ కారణం కూడా ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని పరిపాలించిన దిలీపకర్ణి అనే రాజుకు కలలో స్వామివారు కనిపించి తాను ఫలానా ప్రాంతంలో ఉన్నానని తనను వెలికి తీసి గుడిని నిర్మించాలని పేర్కొన్నాడు.
స్వామివారు సెలవిచ్చిన ప్రకారం రాజు దిలీపకర్ణి, తన 76 వేల మంది సైనికులతో వెళ్లి స్వామివారు సెలవిచ్చిన ప్రాంతాన్ని తవ్వడం మొదలుపెట్టారు. అలా తవ్వుతున్న సమయంలో గునపం స్వామివారి ఉదరంలో గుచ్చుకుంది. గుచ్చుకున్న ప్రాంతం నుంచి ద్రవం కారణం మొదలైంది. అలా కారుతున్న ద్రవాన్ని సేవిస్తే సంతానం కలుగుతుందని భక్తులు నమ్ముతున్నారు. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు నిజం కూడా. ద్రవం కారుతున్న ప్రాంతంలో అర్చకులు పసుపు, చందనాన్ని లేపనంగా వేస్తారు. ప్రతి ఆది, సోమ, శనివారాల్లో ఉదరం ప్రాంతం నుంచి చందనం లేపనాన్ని తొలగించి, ఆ ప్రాంతం నుంచి కారే ద్రవాన్ని పట్టి భక్తులకు పంచిపెడతారు.
ఆఫ్ఘన్-పాక్ దేశాల మధ్య ఉద్రిక్తత… దాడులకు ప్రతీకారం తీర్చుకుంటాం
ఈ ద్రవం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు మల్లూరు శ్రీహేమాచల నరసింహ స్వామి ఆలయానికి వస్తుంటారు. అంతేకాదు, ఈ ఆలయంలో మరో విశేషం కూడా ఉంది. స్వామివారి పాదాల నుంచి నిత్యం నీళ్లు కారుతుంటాయ. ఈ నీరు ఆలయం నుంచి అటవి ప్రాంతంలోని వివిధ ప్రాంతాల గుండా ప్రయాణించి చింతామణి అనే చిన్న జలపాతంగా మారుతుంది. ఈ నీరు ఔషధ చెట్లకిందనుంచి ప్రవహించడంతో నీరు ఔషధ గుణాలు కలిగిన ఔషధంగా మారుతుంది. ఈ నీటిని ప్రతిరోజూ కొద్ది కొద్దిగా తీసుకుంటే పలు రకాలైన రోగాల నుంచి విముక్తి కలుగుతుందని చెబుతున్నారు.
ఇక ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కాకతీయ వంశస్థుల్లో ప్రముఖులైన రాణి రుద్రమదేవి, శతృవులతో యుద్ధం చేసిందని చెబుతారు. ఈ యుద్ధంలో గాయపడిన రుద్రమదేవికి ఈ ఆలయం పరిసర ప్రాంతంలోనే వైద్యులు చికిత్స చేశారని, ఆలయ సమీపంలో ఉన్న చింతామణి జలపాతంలోని నీటిని ఆమె పట్టించారని, ఆ కారణంగానే ఆమె అనారోగ్యం నుంచి బయటపడిందని చెబుతారు. నీటి విశిష్టతను తెలుసుకున్న రుద్రమదేవి ఆ జలపాతానికి చింతామణి అని పేరు పెట్టినట్టుగా చరిత్రకారులు చెబుతున్నారు. నేటికీ ఆ జలపాతాన్ని చింతామణి జలపాతంగా పిలుస్తున్నారు. ఈ ఆలయంలోనే లక్ష్మీదేవి, గోదాదేవిల ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో శిఖాంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. శిఖాంజనేయుడు హేమాచల లక్ష్మీనరసింహస్వామికి క్షేత్రపాలకుడనే ప్రచారం ఉంది.