ప్రపంచం చుట్టిరావాలనే కల ప్రతి ఒక్కరికీ ఉంటుంది. భిన్న సంస్కృతులు, భిన్న సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల గురించి తెలుసుకోవాలని, వాటిని చూడాలని, అక్కడి పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తే వాటిని మిగతావారితో పంచుకోవాలని ఉంటుంది. అయితే, అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కొందరికీ వీలైనప్పటికీ ఎక్కడికెక్కడికో వెళ్తుంటారు. టూరిజంను ఇష్టపడేవారు తప్పకుండా ఓ దేశానికి వెళ్లి అక్కడి పరిస్థితులను తప్పక తెలుసుకోవాలి. ఆ దేశమే జపాన్. 1945కి ముందు అంటే రెండో ప్రపంచ యుద్ధం జరిగే నాటికి ప్రపంచ దేశాల్లో బలమైన సైనిక శక్తి కలిగిన దేశం. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా అణుబాంబులు వేయడంతో ఆ దేశం చాలా వరకు దెబ్బతిన్నది. కానీ, వెంటనే తిరిగి కోలుకొని, 70 ఏళ్లలో ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి సాధించింది. పరిశుభ్రతకు ఆ దేశం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. మరి జపాన్‌లో మనం చూడవలసిన, నేర్చుకోవలసిన అంశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
- జపాన్ రాజధాని టోక్యోలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ టూరిజం బ్యాన్‌లో ఉంది. అక్కడ నివశించే ప్రజల వ్యక్తిగత జీవితానికి భంగం కలుగకూడదనే ఉద్దేశంలో ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో టూరిజంను బ్యాన్ చేసింది. ఒకవేళ ఆ ప్రదేశానికి టూరిస్టులు వెళ్లినా వీడియోలు తీయడం నిషేధం.
- జపాన్‌లో షిబుయా, టోక్యో స్టేషన్లు వంటి రద్దీ ప్రదేశాల్లో, ప్రజల అడుగుజాడల ద్వారా శుద్ధమైన విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు పైజోఎలక్ట్రిక్ ఫ్లోర్ టైల్స్‌ను ఉపయోగిస్తున్నారు. నడక నుంచే విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా జపాన్ విద్యుత్ కొరత నుంచి బయటపడుతున్నది.
- జపాన్‌లో ప్రజలే కాదు అక్కడి జంతువులు కూడా ట్రాఫిక్ రూల్స్‌ను పాటిస్తాయి. నారా నగరంలో జింకలు రోడ్డు దాటేందుకు ట్రాఫిక్ సిగ్నల్ పడే వరకు ఎదురు చూస్తుంటాయి. ఎప్పుడు ఎలా ట్రాఫిక్ సిగ్నల్స్ పడతాయో వాటికి బాగా తెలుసు.
- జపాన్ ప్రజలు క్రమశిక్షణకు, గౌరవానికి ప్రాధాన్యత ఇస్తారు. వీటిని మనం తప్పనిసరిగా చూసి తీరాలి.
- జపాన్ వెళ్లినవారు రెస్టారెంట్లలో వీటిని తప్పనిసరిగా అబ్జర్వ్ చేయాలి. మనం కూర్చునే టేబుల్ వద్ద మొబైల్ ఫోన్లకు సంబంధించిన ప్రత్యేకమైన పౌచ్‌లు ఉంటాయి. వీటిని డిస్పెక్టెంట్ స్లాట్లు అని పిలుస్తారు. మొబైల్ ఫోన్లు చూస్తూ తినకుండా ఉండేందుకు ఇదొక సౌకర్యం.
- జపాన్‌లో భూకంపాలు అధికం. తరచుగా అక్కడ భూప్రకంపనలు సంభవిస్తూ ఉంటాయి. అయితే, వీటిని తట్టుకొని భవనాలు, రోడ్లు నిలబడే విధంగా ఏర్పాటు చేసుకున్న ఇంజనీరింగ్ గొప్పదనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన డ్రైనేజీ వ్యవస్థ జపాన్‌లో మనకు కనిపిస్తుంది.
- జపాన్‌లో పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఆ దేశ నియమాలను గౌరవిస్తూ, వాటిని విధిగా పాటిస్తుంటారు.
ఇవేకాదు జపాన్‌లో ఇంకా ఎన్నో అంశాలు మనకు కనిపిస్తుంటాయి. ఈ కారణంగానే జపాన్ దేశాన్ని సందర్శించేవారి సంఖ్య ప్రతి ఏడూ పెరుగుతూనే ఉంటుంది.