అఖండ సినిమా కి సీక్వెల్ అని ప్రకటించినప్పుడే సినిమా కచ్చితంగా హిట్ అని అనుకున్నాం కదా… ఇక ఇప్పుడు ఆ సినిమా ట్రైలర్ చుసిన తరవాత నో డౌట్స్ కచ్చితంగా రికార్డ్స్ బ్రేక్ చేసే సినిమా ఇది అని కంఫర్మ్ అయ్యింది…
ట్రైలర్ లో బాలకృష్ణ మళ్లీ అఘోర అవతారంలో కనపడి సూపర్ అనిపించాడు. ఆయన “అఖండం సర్జికల్ స్ట్రైక్… ఇది శిక్ష కాదు, తీర్పు!” డైలాగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది… ఈ సినిమాలో మనకి ప్రీక్వెల్ లో చూపించినట్టుగా బాలయ్య మళ్లి హిమాలయాలకు వెళ్ళిపోతాడు కదా… కానీ ఇక్కడ తల్లి చివరి చూపు కోసం మళ్లి తిరిగి వస్తాడు… తన తమ్ముడు కూతురు నానమ్మ కోసం పెద్దనాన్న ని తిరిగి తీసుకొస్తుంది… కానీ ఈసారి విలన్ ఆది పినిశెట్టి … ట్రైలర్లో చిన్న చిన్న సన్నివేశాలే మనసుని కదిలిస్తాయి— పూజారి కన్నీళ్లు, ప్రజల అరుపు, పాపం మీద పండుతున్న అహంకారం, చివరగా అఖండుడి ఆగని ధర్మయుద్ధం.
ఆది పినిశెట్టి విలన్గా అద్భుతంగా కనిపించాడు. అతని కళ్లల్లోని హింస నెక్స్ట్ లెవెల్… సో, డిసెంబర్ 5 న రిలీజ్ అయ్యే ఈ సినిమా పైన అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి!