ఈ నియమాల ప్రకారమే ఇంట్లో అక్వేరియం ఉంచుతున్నారా?

అక్వేరియం ఇంటి అలంకరణ కోసం మాత్రమే కాదు ఇంటికి శుభాశుభాలను కూడా తీసుకొచ్చేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అక్వేరియం చిన్నదైనా కావొచ్చు లేదా పెద్దదైనా కావొచ్చు. అది ఉంచవలసిన దిశ కూడా ముఖ్యమైనదే. అక్వేరియాన్ని ఉత్తర దిశలో ఉంచడం శుభకరమని పండితులు చెబుతున్నారు. ఈ దిశ ధనం, అవకాశాలను తీసుకొచ్చే దిశగా చెబుతారు. ఈ దిశలో అక్వేరియాన్ని ఉంచితే ఆర్థికంగా స్థిరత్వం కలుగుతుంది. కటుంబంలో సంతోషం పెరుగుతాయని పండితులు చెబుతున్నారు. అక్వేరియాన్ని తూర్పు దిశలో కూడా ఉంచవచ్చు. తూర్పు దిశలో ఉంచడం వలన ఆరోగ్యం కుదుటపడుతుంది. కుటుంబంలో ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. కుటుంబ సమైక్యత పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈశాన్యదిశలో అక్వేరియాన్ని ఉంచడం వలన కూడా అత్యంత పవిత్రమైనదేనని పండితులు చెబుతున్నారు. అక్వేరియాన్ని ఈశాన్యంలో ఉంచితే శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రయాణాలు అనుకూలమైన దిశగా అక్వేరియాన్ని చెబుతారు. అంతేకాదు, ఈ దిశ మనశ్వాంతికి చిహ్నంగా కూడా పండితులు చెబుతారు.

ఇక చేపల అక్వేరియాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ, పశ్చిమ, అగ్నేయం, నైరుతి దిశల్లో ఉంచకూడదు. ఈ దిశలో అక్వేరియం ఉంచడం వలన గొడవలు జరుగుతాయని, ఆర్థిక నష్టాలు, అనారోగ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. దోషాలకు కూడా కారణమౌతుందని కూడా పండితులు చెబుతున్నారు. అక్వేరియంలో తప్పకుండా కొన్ని రకాలైన చేపలు శుభఫలితాలను ఇస్తాయని జ్యోతిష్యశాస్త్రం చెబుతున్నది. అక్వేరియంలోని గోల్డ్‌ఫిష్‌ అదృష్టానికి సూచికగా చెబుతారు. ఇది ఇంట్లో సంతోషాన్ని తీసుకొస్తుంది. అదేవిధంగా ఎంజెల్‌ఫిష్‌ కూడా శాంతికి, సంపదకు సూచికగా చెబుతారు. ఇక బ్లాక్‌ మోల్లీ ఫిష్ దుష్టశక్తులను నివారించడానికి ఉపయోగపడుతుంది. కోయ్‌కార్ప్‌ చేపలు ఆధ్యాత్మిక ప్రగతికి, ధనవృద్ధికి చిహ్నంగా ఉంటుంది. ఆరో ప్లాంట్‌ చేపలు ఇంటి వాతావరణాన్ని శుభ్రం చేయడానికి సహాయపడతాయి.

అయితే, అక్వేరియంలో షార్క్‌, బెట్టాస్‌ చేపలను పెంచకూడదు. ఇవి ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయని జ్యోతిష్యపండితులు చెబుతున్నారు. అక్వేరియాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. మరణించిన చేపలను అక్వేరియం నుంచి వెంటనే తొలగించాలి. అక్వేరియంలో చేపలు ఒంటరిగా ఉండకూడదు. కనీసం 7 నుంచి 9 రకాలైన చేపలు అక్వేరియంలో ఉంచడం మంచిది. 7 లేదా 9 చేపలలో కనీసం ఒకటైనా నలుపు రంగులో ఉండాలని జ్యోతిష్యపండితులు చెబుతున్నారు. అక్వేరియంలో నీరు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి. అక్వేరియంలో మురికినీరు ఉంచకూడదు. మురికినీరు ఉంటే ఎప్పటికప్పుడు మారుస్తుండటం శుభకరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *