బాహుబలి మేజిక్ ఇప్పుడు యానిమేషన్ లో…

టెన్ ఇయర్స్ క్రితం ఇండియన్ సినిమా లో ఒక చరిత్ర సృష్టించిన బాహుబలి… ఇప్పటికీ ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తూనే ఉంది. ‘ది ఎపిక్’ రిలీజ్‌తో మరోసారి థియేటర్లలో తన మ్యాజిక్ చూపించిన ఈ సినిమా… ఇప్పుడు మరొక కొత్త అధ్యాయాన్ని తెరపైకి తీసుకువస్తోంది — “Baahubali: The Eternal War”.

మంగళవారం విడుదలైన ఈ సిరీస్ మొదటి భాగం టీజర్‌ని స్వయంగా ఎస్‌.ఎస్‌ రాజమౌళి లాంచ్ చేసారు. ఇందులో మళ్లీ మన అమరేంద్ర బాహుబలి అద్భుతమైన యానిమేటెడ్ రూపంలో, మహోన్నతమైన యాక్షన్‌తో సందడి చేస్తూ కనిపించారు. Star Wars: Visions, Schrikoa, Kalki వంటి యానిమేటెడ్ ప్రాజెక్ట్స్‌కు పని చేసిన ఇషాన్ శుక్లా ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్.

టీజర్ మొదలు శివగామి (రమ్య కృష్ణ) గంభీర వాయిస్‌తో… “బాహుబలిని కోల్పోయినా, కొత్త యుగం మొదలైంది” అని చెప్పడంతో స్టార్ట్ అవుతుంది. వెంటనే దేవతలూ–అసురుల మధ్య యుద్ధం… విషసుర, ఇంద్ర మధ్య ఘర్షణ… చివరికి రథంపై ఏకంగా అమరేంద్ర బాహుబలి ఎంట్రీ!

విజువల్స్ అద్భుతం… బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ goosebumps. అయితే కథను బాహుబలి యూనివర్స్‌లో బలవంతంగా అటాచ్ చేశారేమో అన్న ఫీలింగ్ కూడా కొద్దిగా కనిపిస్తోంది. కానీ ప్రేక్షకుల హృదయాల్లో ఉన్న బాహుబలి క్రేజ్‌ను చూస్తే… ఇది కూడా ఘన విజయాన్ని అందుకునే అవకాశం ఉంది.

ఇటీవల కన్నడ అనిమేషన్ ఫిల్మ్ మహావతార్ నరసింహ బాక్సాఫీస్‌ వద్ద సూపర్ హిట్టయింది. అటువంటి టైమ్‌లో బాహుబలి యానిమేటెడ్ సిరీస్ వస్తుండటమే పెద్ద సంచలనం. అద్భుతమైన విజువల్స్‌తో, థ్రిల్లింగ్ నేరేషన్‌తో తీస్తే… రికార్డులు బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది.

“Baahubali: The Eternal War” పార్ట్ 1 — 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *