వైల్డ్ కార్డ్స్ వచ్చిన తరవాత మారిన బిగ్ బాస్ 9 గేమ్…

ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని జనరల్ గా అంటున్నాం కదా! బిగ్ బాస్ తెలుగు 9 సీజన్లో కి ఈ సామెత పక్క గా సరిపోతుంది…

ఫస్ట్ 5 వారలు ఆట బాగానే సాగింది… పెద్ద గొడవలు లేకపోయినా, మంచి గా ఉన్నారు అందరు bondings పెంచుకుని. కానీ ఎప్పుడైతే ఫైర్ స్ట్రామ్ 2.0 నుంచి 6 వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వచ్చారో, గేమ్ మారింది, స్ట్రాటజీస్ మారాయి… అంతా మారిపోయింది.

ఇప్పటి వరకు tenants , ఓనర్స్ అని రెండు ఇల్లులు ఉండేవి, అందరు హాయిగా పడుకునేవారు, కానీ ఇప్పుడు మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ అందరు ఇరుకుగా పడుకుంటున్నారు… ఒక బెడ్ లో ముగ్గురు అంటే కష్టం కదా!

అలానే వైల్డ్ కార్డు ద్వారా, రమ్య మోక్ష, దివ్వెల మాధురి, సాయి, నిఖిల్, అయేషా, గౌరవ్ ఇలా అందరు స్ట్రాంగ్ వాళ్ళు వచ్చారు… రమ్య వచ్చినప్పటి నుంచి అందరి దెగ్గరికి వెళ్లి, బయట వాళ్ళు ఎలా portray అవుతున్నారు చెప్తుంది… అయేషా కూడా అలానే చేస్తుంది. దీని వల్ల డెమోన్ పవన్ – రీతూ, భరణి, దివ్య ఇంకా తనూజ కి గొడవలు అయ్యాయి… అన్ని బాండ్స్ వీక్ అయ్యాయి.

నామినేషన్స్ లో కూడా బాండ్స్ గురించే గొడవలు అయ్యాయి. అలానే సంజన మాత్రం ఎంజాయ్ చేస్తుంది. మాధురి తో ఎంజాయ్ చేస్తుంది. నిఖిల్ ఇంకా గౌరవ్ అందరిని observe చేస్తూ plans వేస్తున్నారు. మాధురి కూడా పరిస్థితికి తగ్గట్టు ఆడుతున్నారు. సో, మొత్తానికి గేమ్ మారింది, ఆటగాళ్ల ఆట మారింది. సో, చూడాలి ఈ వరం మరి రాము లేకపోతె సుమన్ లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు అంటున్నారు… చూద్దాం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *