ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టుగా ఉంది మీ ప్రశ్న అంటారేమో. ఎందుకంటే ఆర్సీబీ గతంలో మూడుసార్లు ఫైనల్‌కు చేరుకుంది. 2009, 2011, 2016లో కూడా ఫైనల్ వరకు వెళ్లి ఓటమిపాలైంది. ఇప్పటి వరకు జరిగిన 17 సీజన్స్‌లోనూ ఒక్క సీజన్‌లో కూడా విజేతగా నిలవలేకపోయింది ఆర్సీబీ. అయితే, ప్రస్తుతం పాటేదార్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఆర్సీబీ అన్ని విధాలుగా దూకుడుగా ఉండటం విశేషం. అయితే, గుజరాత్ టైటాన్స్ జట్టు ఆరంగ్రేటం చేసిన తొలి ఏడాది అంటే 2022లోనే మొదటి టైటిల్‌ను గెలుచుకున్నది. ఆ తరువాత ఏడాది ఫైనల్స్‌కు చేరుకున్నా చెన్నై చేతిలో ఓటమిపాలైంది. మరోవైపు ముంబై ఇండియన్స్ ఈ సీజన్స్‌లో చాలా నెమ్మదిగా ఆటను ప్రారంభించి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఫైనల్స్‌కు చేరుకున్నది. ఈ రెండు జట్ల మధ్య ఈరోజు రాత్రి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన విజేతతో ఆర్సీబీ ఫైనల్స్‌లో తలపడనుంది. ఆర్సీబీ యువత, అనుభవం ఉన్న ఆటగాళ్లతో ఉత్సాహంగా ఉండటం విశేషం.
ఇప్పటి వరకు జరిగిన సీజన్స్‌లో ఒక్క సీజన్ కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు గెలుచుకోలేకపోయింది. ఈసారి ఎలాగైనా గెలవాలనే కసితో కనిపిస్తున్నది. ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ, పంజాబ్, ఢిల్లీ జట్లు ఒక్కసారి కూడా చాంపియన్స్‌గా నిలవలేకపోయాయి. దూకుడుగా ఆడుతున్నప్పటికీ అదృష్టం కలిసిరావడం లేదు ఈ జట్లకు. ఈసారి అవకాశం ఆర్సీబీకి వచ్చింది. ఫైనల్స్‌కు చేరుకున్న ఆర్సీబీ మరింత దూకుడుతో ఆడి ఫైనల్స్ విజేతగా నిలవాలని కోరుకుందాం.