రోషన్ ‘ఛాంపియన్’ సినిమా నుంచి ‘గిరా గిరా గింగిరాగిరేయి’ సాంగ్…

మెకా రోషన్, అనస్వారా రాజన్ హీరో–హీరోయిన్లుగా వస్తున్న ‘ఛాంపియన్’ సినిమా ప్రొమోషన్లు ప్రస్తుతం అద్భుతమైన హైప్ క్రియేట్ చేస్తున్నాయి. లైవ్లీ కంటెంట్, ఆకట్టుకునే పోస్టర్‌లు, వీడియోలతో ఈ మూవీపై మంచి ఎక్సైట్మెంట్ ఏర్పడింది. తాజాగా వచ్చిన టీజర్‌లో 1940ల బ్రిటిష్ ఇండియా లోకల్ హైదరాబాదీ ఫుట్బాల్ ప్లేయర్‌ కథను సూపర్ గా చూపించారు. క్వీన్ ఎలిజబెత్‌ను కలవాలని కలగంటున్న యువకుడి ప్రయాణాన్ని దర్శకుడు ప్రదీప్ అద్వైతం అద్భుతమైన విజన్‌తో చూపిస్తున్నాడు.

లేటెస్ట్ గా మేకర్స్ హీరోయిన్ అనస్వారా రాజన్‌ను ‘చంద్రకళ’ గా పరిచయం చేస్తూ ఫస్ట్ సింగిల్ ‘గిరా గిరా’ ని విడుదల చేశారు. ఈ సాంగ్ తో మిక్కీ జె మేయర్ మళ్లీ తన మ్యాజిక్ చూపించాడు. గ్రామీణ అందాలను సంగీత రూపంలో అద్భుతంగా ప్రెజెంట్ చేశాడు. స్క్రీన్ మీద విజువల్స్ చూస్తుంటే అప్పటి ప్రీ-ఇండిపెండెన్స్ కాలానికి మనల్ని టైమ్ ట్రావెల్ చేసినట్టుగా ఫీలవుతుంది.

మెకా రోషన్ – అనస్వారా రాజన్‌ల మధ్య ఏర్పడుతున్న ఫ్రెండ్షిప్, స్లోగా పెరుగుతున్న కెమిస్ట్రీ చాలా క్యూట్‌గా, లవ్లీగా కనిపిస్తుంది. ముఖ్యంగా చంద్రకళ పాత్రలో అనస్వారా చూపించిన చిలిపితనం, గ్రామీణ సొగసు తెరపై హైలైట్‌గా నిలుస్తాయి. రోషన్ కూడా తన ఎనర్జీ, బాడీ లాంగ్వేజ్‌తో స్క్రీన్‌ను డామినేట్ చేస్తున్నాడు. ఇక ఈ సాంగ్ కి choreograph చేసిన ఆట సందీప్ మంచి ఈజీ స్టెప్స్ తో మళ్ళి మళ్ళి ఈ సాంగ్ హుక్ స్టెప్ మనం వేసేలా చేసాడు…

రామ్ మిరియాల గాత్రం, కసర్ల శ్యామ్ లిరిక్స్ ఈ మెలోడి కి ఒక క్యూట్ ఫీలింగ్ ఇచ్చాయి. ప్రీ–ఇండిపెండెన్స్ ఇండియాను సరిగ్గా ఆరాధ్యంగా చూపించిన ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా ప్రశంసనీయం.

‘ఛాంపియన్’ ఈ ఏడాది డిసెంబర్ 25, 2025 న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *