మన శంకర వర ప్రసాద్ గారు సినిమా నుంచి ‘శశిరేఖ’ సాంగ్ ప్రోమో అదిరిపోయింది…

అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి కలిసి చేస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు సినిమా మీద ఎలాంటి బజ్ ఉందొ మన అందరికి తెలిసిందే కదా… ఇక ఈ సినిమా సంక్రాంతి కె థియేటర్స్ లోకి రాబోతోంది కాబట్టి, ప్రమోషన్స్ గట్టిగా మొదలు పెట్టారు. ఆల్రెడీ మీసాల పిల్ల సింగ్ అదిరిపోయింది… ఇక ఇప్పుడు “శశిరేఖ…” సాంగ్ ప్రోమో కూడా రిలీజ్ చేసారు…

ఇందులో చిరు – నయన్‌ ట్రెడిషనల్ లుక్‌లలో కనిపిస్తూ, రెండు బోట్స్ మీద అందంగా ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ మత్తెకించారు. భీమ్స్ మ్యూజిక్, అతని వోకల్స్ తో పాటు మధుప్రియ గాత్రం కలవడంతో ఓ లైవ్లీ, ఫీల్–గుడ్ రిథమ్ అప్పుడే ట్రేండింగ్ లోకి వెళ్ళిపోయింది!

ఇది ప్రోమో మాత్రమే…ఇంక రెండు రోజుల్లో ఫుల్ సాంగ్ రాబోతుండటంతో ఆసక్తి మిన్నంటుతోంది. సో, 8th డిసెంబర్ వరకు వెయిట్ చేయక తప్పదు!

సాహు గరపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మొత్తానికి, సంక్రాంతి 2026కి మెగాస్టార్ మరో థియేట్రికల్ సెలబ్రేషన్ రెడీ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *