మ్యూజిక్‌ ఇండియాలో దూసుకుపోతున్న మీసాల పిల్ల

మరోసారి హాట్‌ టాపిక్‌గా మారిన మెగాస్టార్‌ మీసాలపిల్ల సాంగ్‌. యూట్యూబ్‌తో పాటు అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో నెంబర్‌ వన్‌గా నిలిచింది. యూట్యూబ్‌లో 30 మిలియన్‌ వ్యూస్‌, ఇన్‌స్టాలో 30 వేలకు పైగా రీల్స్‌, 300 మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించి ఇండియాలో నెంబర్‌ 1 సాంగ్‌గా నిలిచింది. ఈ సాంగ్‌ విడుదలైనపుడు సీరియల్‌ సాంగ్‌ అంటూ ట్రోల్స్‌ చేసినా క్రమంగా చిరంజీవి గ్రేస్‌తో మరోసారి వింటేజ్‌ చిరంజీవి కనిపించారని అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.

ఇప్పుడు టాప్‌గా నిలవడంతో చిరు కమ్‌బ్యాక్‌ అంటున్నారు అభిమానులు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్ర కూడా చేస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. సంక్రాంతికి పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ, అనీల్‌ రావిపూడి సినిమా అంటేనే సంక్రాంతి సందడి కావడం అంతేకాకుండా, మన శివశంకర వరప్రసాద్‌గారు సినిమా ట్యాగ్‌లైన్‌ పండుగకు వస్తున్నామని ఉండటంతో సంక్రాంతి ఫెస్టివల్‌కి ఫర్‌ఫెక్ట్‌ ఎంటర్‌టైనర్‌ అవుతుందని అంచనా వేస్తున్నారు.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏ విధంగా హిట్టయ్యి భారీ వసూళ్లు రాబట్టిందో… ఇప్పుడు ఈ సినిమా కూడా అదే రేంజ్‌లో హిట్టయ్యి కలెక్షన్ల సునామీని సృష్టిస్తుందని అభిమానులు చెబుతున్నారు. మరి అభిమానుల అంచనాలను అనీల్‌ రావిపూడి అందుకుంటారా? లేదా అన్నది తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే. సంక్రంతికి వస్తున్నాం పేరుతో వెంకటేష్‌ 200 కోట్ల క్లబ్‌లో చేరిపోయారు. శివశంకర వరప్రసాద్‌ సినిమాతో మెగాస్టార్‌ కూడా ఆ క్లబ్‌లో చేరతారా లేదా అన్నది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *