ఐ బొమ్మ పని ఖతం చేసిన సజ్జనార్…

మెగాస్టార్ చిరంజీవి – కింగ్ నాగార్జున… ఇద్దరూ నిన్న హైదరాబాద్ కమిషనర్ వి.సి. సజ్జనార్‌ని ప్రత్యేకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. సినీ పరిశ్రమకు పెద్ద ముప్పుగా మారిన ఐబొమ్మ పైరసీ వెబ్‌సైట్ యజమాని రవిని అరెస్ట్ చేసినందుకు పోలీస్ శాఖ చేసిన కృషి పట్ల అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ…
“సినిమా బిజినెస్‌కి హాని చేసే ఒక ప్రమాదకర నెట్‌వర్క్‌ను పోలీసులు తెలివిగా ఛేదించటం చాలా ఆనందంగా ఉంది. రిలీజ్ రోజునే సినిమాలు పైరసీగా చూడటానికి అలవాటు పడిపోయిన చాలా మందికి వీళ్లే కారణం. ఇకముందైనా ఇది ఆగాలి” అని భావోద్వేగంగా చెప్పారు.

నాగార్జున కూడా హైదరాబాద్ పోలీసులను ప్రశంసిస్తూ…
“ఇంత త్వరగా నిందితున్ని పట్టుకోవడం నిజంగా గొప్ప విషయం. తెలుగు సినిమా తరఫున మాత్రమే కాదు, భారతీయ సినిమా తరఫున కూడా మేము సజ్జనార్ గారిని, ఆయన బృందాన్ని అభినందిస్తున్నాం” అన్నారు.

అంతేకాకుండా… ప్రజలు పైరసీని ప్రోత్సహించకుండా, థియేటర్లలో సినిమాలు చూసి పరిశ్రమకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *