పీఎస్ లో నాగుపాము

కార్తీక మాసం వేళ… పరమేశ్వరుని మెడలో ఉండే నాగుపాము విజయనగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం దర్శనమిచ్చింది. పవిత్ర కార్తీక మాసం శుభ సందర్భాన కరుడుగట్టిన, కాఠిన్య మనసు ఉన్న ఖాకీల కంట పడింది. అయితే ఆ కాఠిన్యపు హృదయంతో చూడని విజయనగరం టూటౌన్ పోలీసులు విషపు జాతుల పట్ల కారణ్యమైన ప్రేమ చూపించి శహభాష్ అనిపించుకున్నారు. టూటౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ కనకరాజుల ఆధ్వర్యంలో వారిచ్చిన ఆదేశాలతోకానిస్టేబుల్ రమేష్ చాకచక్యంగా స్టేషన్ ఆవరణలో కనిపించిన ఆ పాముకు నమస్కరించి… ఎలాంటి భయం, బెదురు లేకుండా చేత్తోనే ఆ విషపు సర్పాన్ని పట్టుకొని స్టేషన్ పక్కనే పొదల్లో పడేశారు. ఏదైనా కార్తీక మాసం పూట పోలీస్ స్టేషన్ లో ఖాకీల కంట పడిన ఆ పాము ను ఇదే ఖాకీలు కొట్టకుండా, చంపకుండా కనికరం జాలి, దయ, గుణాలు చూపించారంటే అతిశయోక్తే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *