32 కార్లతో దాడికి యత్నం…కుట్ర భగ్నం

Spread the love

డిసెంబర్‌ 6న బ్లాక్‌డే సందర్భంగా దేశవ్యాప్తంగా భయానక దాడులు జరపాలనే యత్నం వెనుక ఉన్న కుట్రను భద్రతా సంస్థలు సమయానికి గుర్తించాయి. నివేదికల ప్రకారం, మొత్తం 32 కార్లు బాంబులతో నింపి, వివిధ రాష్ట్రాల్లో పేల్చాలనే ప్రణాళిక సిద్ధమైంది. వీటిలో 3 కార్లు ఇప్పటికే పోలీసులు పట్టుకున్నారు, హ్యూండాయ్‌ i20 కారులో సాంకేతిక లోపంతో ముందుగానే పేలిపోయింది. ఈ పేలుడు తర్వాతనే మొత్తం కుట్ర బహిర్గతమైంది.

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఈ కార్లను ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర రాష్ట్రాల పరిధిలో వినియోగించేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి వాహనంలో 20 నుండి 25 కిలోల వరకు అమోనియం నైట్రేట్‌, జెలటిన్‌ స్టిక్స్‌, మరియు డెటోనేటర్లు అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వాహనాలను భిన్న భిన్న ప్రదేశాల్లో పార్క్‌ చేసి, ఒకేసారి పేల్చాలనే ఉద్దేశంతో టిమ్‌ పనిచేస్తున్నట్లు సమాచారం.

దీనికి సంబంధించిన ఇన్‌టెలిజెన్స్‌ అలర్ట్‌ ఆధారంగా, భద్రతా సంస్థలు అవతార్‌ ఆపరేషన్‌ పేరుతో ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించాయి. పట్టుబడిన 3 కార్లను ఫోరెన్సిక్‌ విభాగం పరిశీలించగా, వాటిలో విస్తృత స్థాయి పేలుడు పదార్థాలు కనుగొన్నారు. దాడి వెనుక ఉన్న ముఠా అంతర్జాతీయ ఉగ్ర సంస్థలతో సంబంధం కలిగి ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సంఘటన తర్వాత అన్ని రాష్ట్రాల పోలీస్‌ శాఖలు హై అలర్ట్‌లోకి వెళ్లాయి. ముఖ్యంగా ఆలయాలు, ప్రజా రవాణా కేంద్రాలు వంటి సున్నిత ప్రాంతాల్లో భద్రత మరింత కఠినతరం చేశారు.

సీనియర్‌ అధికారుల ప్రకారం, ఈ దాడి యత్నం విజయవంతమై ఉంటే దేశంలో తీవ్రమైన ప్రాణ నష్టం, సామాజిక ఉద్రిక్తతలకు దారి తీసేదని అన్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుండగా, మరికొన్ని కార్లు ఇంకా ట్రాక్‌లో ఉన్నట్లు సమాచారం. సమయానికి భద్రతా సంస్థలు జాగ్రత్తగా వ్యవహరించడంతో, దేశం పెద్ద విషాదం నుంచి తప్పించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit