రణవీర్ సింగ్ ధురంధర్ లేటెస్ట్ కలెక్షన్ రిపోర్ట్

అదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ డ్రామా ధురంధర్ గత శుక్రవారం విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. రిలీజ్ రోజే డీసెంట్ ఓపెనింగ్ అందుకున్న ఈ చిత్రం, పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్‌తో వీకెండ్‌లో మరింత బలపడింది. ముఖ్యంగా ‘బుక్ మై షో’ నెంబర్లు చాలా స్ట్రాంగ్‌గా కనిపించాయి.

డే-వైజ్ బుక్ మై షో టికెట్ సేల్స్ ఇలా ఉన్నాయి:

Day 1: 376K టికెట్స్

Day 2: 462K టికెట్స్

Day 3: 490K టికెట్స్

Monday: 378K టికెట్స్ — వర్కింగ్ డే కావడంతో కొంత డ్రాప్ అయినా, ఫ్రైడే నెంబర్స్‌కి చాలా దగ్గరగా ఉన్నాయి.

Tuesday: 408K టికెట్స్ — ఇది మళ్లీ రైజ్‌కి సంకేతం ఇచ్చింది.

ఇంకా ఇంట్రస్టింగ్ విషయం ఏమిటంటే…
బుధవారం కోసం అడ్వాన్స్ బుకింగ్స్ మరింత బలంగా ఉన్నాయి!

Monday PIC Advances: 47,000

Tuesday PIC Advances: 80,000

Wednesday PIC Advances: 98,000 (రిపోర్ట్ చేస్తున్న సమయానికి)

ఈ ట్రెండ్ చూస్తుంటే బుధవారం ఇప్పటివరకు బెస్ట్ డే కావొచ్చు అని ట్రేడ్ టాక్ చెబుతోంది. అదే సమయంలో, వచ్చే వీకెండ్ కూడా ఫస్ట్ వీకెండ్ కంటే బెటర్‌గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక కథ విషయానికి వస్తే, ఇది RAW కాంఫ్లిక్ట్స్ ఇంకా ఇండియా పాకిస్తాన్ వార్ డ్రామా అలానే ఒక రా ఏజెంట్ ఎలా పాకిస్తాన్ కి వెళ్లి ఇండియా కోసం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాడో చూపిస్తుంది!

అసలు ధురంధర్ కథ రెండు భాగాలుగా ప్లాన్ చేశారు. ఇప్పుడు పార్ట్ వన్ హిట్ అయ్యింది కాబట్టి, Part 2 — March 19, 2026 న విడుదల కానుంది. ఇప్పుడు ఉన్న ఈ పాజిటివ్ ట్రెండ్ కొనసాగితే, రెండో భాగం మొదటి భాగం కంటే మరింత పెద్ద ఓపెనింగ్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ సినిమాను జ్యోతి దేశ్‌పాండే, అదిత్య ధర్, లోకేష్ ధర్ కలిసి Jio Studios & B62 Studios బ్యానర్లపై నిర్మించారు. ఈ సినిమాలో రణవీర్ సింగ్‌తో పాటు అక్షయే ఖన్నా, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, సారా అర్జున్, రాకేష్ బెడి ముఖ్య పాత్రల్లో నటించారు. మనవ్ గోహిల్, దానిష్ పాండోర్, సౌమ్యా టాండన్, గౌరవ్ గేరా వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *