అల్లం ఒక శక్తివంతమైన సహజ ఔషధమని ఆయుర్వేదం స్పష్టంగా చెబుతోంది. ప్రతిరోజూ చిన్న అల్లం ముక్కను సరైన మోతాదులో తీసుకుంటే శరీరంలో అనేక సానుకూల మార్పులు కనిపిస్తాయి. అల్లంలో ఉండే యాంటీ-ఇన్‌ఫ్లమెటరీ, యాంటీ-ఆక్సిడెంట్ గుణాలు శరీరంలోని వాపులు, నొప్పులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులతో బాధపడేవారికి అల్లం ఎంతో ఉపశమనం ఇస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరచడంలో అల్లం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది జీర్ణరసాల స్రావాన్ని పెంచి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. దీంతో మలబద్ధకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే రోగనిరోధక శక్తిని బలపరిచి జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది.
అల్లం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడటంతో మధుమేహ రోగులకు కూడా ఇది మేలు చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి అల్లం మంచి సహాయకారి. ఉదయం ఖాళీ కడుపుతో అల్లం లేదా అల్లం నీరు తీసుకోవడం శరీరాన్ని డిటాక్స్ చేసి మెటబాలిజాన్ని పెంచుతుంది. అంతేకాదు, చర్మాన్ని కాంతివంతంగా ఉంచి జుట్టును బలంగా చేస్తుంది. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో కూడా అల్లం ఎంతో ఉపయోగకరం.