ఇలా తింటే…మీరు అస్సలు బరువు పెరగరు

భోజనం హడావుడిగా అస్సలు చేయకూడదు. భోజనం చేయడానికి తప్పనిసరిగా అరగంట సమయం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.  బరువును అదుపులో ఉంచుకోవాలి అనుకునేవారు తప్పనిసరిగా ఆహారాన్ని బాగా నమిలి తినాలి.  ఇలా చేయడం వలన ఎక్కువగా కాకుండా తక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటాం. కాని వేగంగా తినేవారు తక్కువ సమయంలోనే తినేయాలి అని చెప్పి నరిగా నమలకుండా, ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటారు.  తద్వారా బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.  అంతేకాదు, బాగా నమిలి తినడం వలన శరీరానికి అవసమైన పోషకాలు త్వరగా అందుతాయి.  తేలిగ్గా జీర్ణం అవుతుంది.  తద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవు.  ఆహారాన్ని నమలడం వలన దంతాలకు కూడా వ్యాయామం అవుతుంది. 

నోటి సంబంధిత సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు.  ఆరోగ్యాన్ని, అందాన్ని, బరువును అదుపులో ఉంచుకోవాలి అంటే తప్పకుండా ఆహారాన్ని బాగా నమిలి తినాలి.  ఆమాశయపాకంలా నమిలి తీసుకోవాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  నిదానంగా నమలడం వలన ఆహారంలోని ఘనపదార్థాలు కూడా మెత్తగా అవుతాయి.  ఇటువంటి ఆహారం జీర్ణాశయంలోకి వెళ్లిన తరువాత సులువుగా జీర్ణమౌతుంది.  ఎక్కువ మొత్తంలో ఆమ్లాలు ఉత్పత్తి కావలసిన అవసరం ఉండదు.  తద్వారా కడుపు మంట, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు ఉత్పన్నం కావు.  ఎవరో చెప్పినట్టుగా కాళ్ల తడి ఆరేలోపుగా భోజనం చేయాలి అనుకుంటే పొరపాటే.  నోటిలోకి తీసుకున్న ఆహారాన్ని కనీసం 72 సార్లు నమలాలని సైన్స్‌ చెబుతున్నది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *